Premamu naabaim boosevu peddarigamu sesevu

ప్రేమము నాపైఁ బూసేవు పెద్దరికము సేసేవు
Language

(॥పల్లవి॥)
ప్రేమము నాపైఁ బూసేవు పెద్దరికము సేసేవు
యేమయ్య నాయకుఁడ నీ హృదయ మెఱఁగను

(॥ప్రేమ॥)
చనవు లిచ్చినవారు సరసము లాడఁ జెల్లు
మనసు లెనయువారి మాఁటలు చెల్లు
ఘనమోహములవారి గబ్బితనములు చెల్లు
యెనసి నే నిందులో నీకెవ్వరో యెఱఁగము

(॥ప్రేమ॥)
సిగ్గులు యెంచనివారు సేసేదల్లా నమరు
వెగ్గళించి వున్నవారి వేడు కమరు
బిగ్గెఁ గాఁగిలించువారు పెనఁగినంతా నమరు
యెగ్గులేదు ఇందులో నీకెవ్వరో యెఱఁగము

(॥ప్రేమ॥)
వావిగలమేనవారు వచ్చి కాలు దొక్కఁదగు
చేవ మీరినవారు మెచ్చితేఁ దగును
శ్రీ వేంకటేశ్వరుఁడ చేరి నన్నుఁ గూడితివి
యీవేళ నే నిందరిలో యెవ్వరో యెఱఁగము

(||pallavi||)
premamu nābaim̐ būsevu pĕddarigamu sesevu
yemayya nāyagum̐ḍa nī hṛdaya mĕṟam̐ganu

(||prema||)
sanavu lichchinavāru sarasamu lāḍam̐ jĕllu
manasu lĕnayuvāri mām̐ṭalu sĕllu
ghanamohamulavāri gabbidanamulu sĕllu
yĕnasi ne niṁdulo nīgĕvvaro yĕṟam̐gamu

(||prema||)
siggulu yĕṁchanivāru sesedallā namaru
vĕggaḽiṁchi vunnavāri veḍu kamaru
biggĕm̐ gām̐giliṁchuvāru pĕnam̐ginaṁtā namaru
yĕgguledu iṁdulo nīgĕvvaro yĕṟam̐gamu

(||prema||)
vāvigalamenavāru vachchi kālu dŏkkam̐dagu
seva mīrinavāru mĕchchidem̐ dagunu
śhrī veṁkaḍeśhvarum̐ḍa seri nannum̐ gūḍidivi
yīveḽa ne niṁdarilo yĕvvaro yĕṟam̐gamu