ప్రయాసపడవద్దు బయలు వెదకవద్దు
(॥పల్లవి॥)
ప్రయాసపడవద్దు బయలు వెదకవద్దు
క్రియ యెఱిఁగినఁ జాలు గెలుతు మిందుననే
(॥ప్రయా॥)
శ్రీపతిసులభుడు చింతించ నేర్చిన
దీపించుమనసు కొని తేవలదు
చేపట్టు గుంచము కడు జిహ్వకుఁ దిరుమంత్రము
దాపగు తులసితీర్థము నఱచేతిది
(॥ప్రయా॥)
అదే వీనులపండుగ ఆచార్యోపదేశము
ముదమున నొసలనే మొక్కు లున్నవి
హృదయము నిక్షేవము యెఱిఁగితే సుజ్ఞానము
సదరము భుజములఁ జక్రలాంఛనములు
(॥ప్రయా॥)
తావుగ దేహమందు ద్వాదశనామములకు
సావివోని సంకల్పమే శరణాగతి
శ్రీవేంకటేశుఁడే దిక్కు జీవులకు నెల్లాను
దేవుఁ డితఁడే మనకుఁ దెలుసుకోరో
(||pallavi||)
prayāsabaḍavaddu bayalu vĕdagavaddu
kriya yĕṟim̐ginam̐ jālu gĕludu miṁdunane
(||prayā||)
śhrībadisulabhuḍu siṁtiṁcha nersina
dībiṁchumanasu kŏni tevaladu
sebaṭṭu guṁchamu kaḍu jihvagum̐ dirumaṁtramu
dābagu tulasidīrdhamu naṟasedidi
(||prayā||)
ade vīnulabaṁḍuga āsāryobadeśhamu
mudamuna nŏsalane mŏkku lunnavi
hṛdayamu nikṣhevamu yĕṟim̐gide sujñānamu
sadaramu bhujamulam̐ jakralāṁchhanamulu
(||prayā||)
tāvuga dehamaṁdu dvādaśhanāmamulagu
sāvivoni saṁkalbame śharaṇāgadi
śhrīveṁkaḍeśhum̐ḍe dikku jīvulagu nĕllānu
devum̐ ḍidam̐ḍe managum̐ dĕlusugoro