Praananaayagumdu vaamde praaneshvarivi neevu

ప్రాణనాయకుఁడు వాఁడె ప్రాణేశ్వరివి నీవు
Language

(॥పల్లవి॥)
ప్రాణనాయకుఁడు వాఁడె ప్రాణేశ్వరివి నీవు
జాణవు నీ విన్నిటాను చలమేఁటికే*

(॥ప్రాణ॥)
వీడనాడవచ్చుగాని వెనక వేఁడుకోరాదు
కూడేరు మీకె పొదు కోప మింతేలే
నీడలు వేరైతోఁచు నిలు వొక్కటేకాదా
యీడనాడ నుండేనంటాయేల నమ్మవే

(॥ప్రాణ॥)
అలుగఁగవచ్చుఁగాని అట్టె కిందుపడరాదు
కలసేరు మీకె పొదు కపటమేలే
పలుకులెన్నైనాఁ దొఁచు బాస వొక్కటేకాదా
పులక లివేడవంటా పొర్లనేఁటికే

(॥ప్రాణ॥)
తప్పు లెంచవచ్చుఁగాని తారుకాణించరాదు
యెప్పుడు మీకె పోదు యెరవేఁటికే
అప్పఁ డిదే శ్రీవేంకటాధిపుఁడు నిన్నుఁ గూడె
కుప్పళించి నవ్వెనంటా గొరఁ జించనేఁటికే

(||pallavi||)
prāṇanāyagum̐ḍu vām̐ḍĕ prāṇeśhvarivi nīvu
jāṇavu nī vinniḍānu salamem̐ṭige*

(||prāṇa||)
vīḍanāḍavachchugāni vĕnaga vem̐ḍugorādu
kūḍeru mīgĕ pŏdu koba miṁtele
nīḍalu veraidom̐su nilu vŏkkaḍegādā
yīḍanāḍa nuṁḍenaṁṭāyela nammave

(||prāṇa||)
alugam̐gavachchum̐gāni aṭṭĕ kiṁdubaḍarādu
kalaseru mīgĕ pŏdu kabaḍamele
palugulĕnnainām̐ dŏm̐su bāsa vŏkkaḍegādā
pulaga liveḍavaṁṭā pŏrlanem̐ṭige

(||prāṇa||)
tappu lĕṁchavachchum̐gāni tārugāṇiṁcharādu
yĕppuḍu mīgĕ podu yĕravem̐ṭige
appam̐ ḍide śhrīveṁkaḍādhibum̐ḍu ninnum̐ gūḍĕ
kuppaḽiṁchi navvĕnaṁṭā gŏram̐ jiṁchanem̐ṭige