పోయినది పొల్లు మీఁదఁ బూఁచి నీ నేరుపులను(?)
(॥పల్లవి॥)
పోయినది పొల్లు మీఁదఁ బూఁచి నీ నేరుపులను(?)
చాయల నీపంతమెల్లా సాదించుకోవయ్యా
(॥పోయి॥)
చలమేల బలిమేల పాకిరేల తెలిపేవు
కలవు నీమాట లన్నీఁ గల్లులాడేవా
వొలిసి నాచేఁతలకు వోరిచితి విన్నాళ్లు
పొల సిఁకనైనా మోసపోక బదుకవయ్యా
(॥పోయి॥)
ఆనలెల సత్యాలేల అట్టె దైవముఁ జూపేవు
కానీవే నిన్నె వ్వరై నాఁ గాదనేరా
పూని వెనకటి వేల బుద్దెరఁగవైతివి
పేని పట్టి యిఁకఁ జెల్లఁబెట్టుకొనవయ్యా
(॥పోయి॥)
నవ్వులేల రవ్వలేల నయమెంత చూపేవు
జవ్వనపునీ వంతజాణవు గావా
యివ్వల శ్రీవేంకటేశ యిట్టి నన్నుఁ గూడితివి
పువ్వువలె నీయిచ్చల భోగించరాదా
(||pallavi||)
poyinadi pŏllu mīm̐dam̐ būm̐si nī nerubulanu(?)
sāyala nībaṁtamĕllā sādiṁchugovayyā
(||poyi||)
salamela balimela pāgirela tĕlibevu
kalavu nīmāḍa lannīm̐ gallulāḍevā
vŏlisi nāsem̐talagu vorisidi vinnāḽlu
pŏla sim̐kanainā mosaboga badugavayyā
(||poyi||)
ānalĕla satyālela aṭṭĕ daivamum̐ jūbevu
kānīve ninnĕ vvarai nām̐ gādanerā
pūni vĕnagaḍi vela buddĕram̐gavaidivi
peni paṭṭi yim̐kam̐ jĕllam̐bĕṭṭugŏnavayyā
(||poyi||)
navvulela ravvalela nayamĕṁta sūbevu
javvanabunī vaṁtajāṇavu gāvā
yivvala śhrīveṁkaḍeśha yiṭṭi nannum̐ gūḍidivi
puvvuvalĕ nīyichchala bhogiṁcharādā