Poyina bamdhamu ladu povum gaaga

పోయిన బంధము లటు పోవుఁ గాక
Language

(॥పల్లవి॥)
పోయిన బంధము లటు పోవుఁ గాక
చీ యని రోసి యెంగిలి చేకొనేదా

(॥పోయిన॥)
తొల్లి చేసినకర్మాలు తొలఁగఁజేసె గురుఁడు
చెల్లఁబో యింకా నవి సేసేదా
వొల్లక విత్తులు తమ వుముకఁ బాసినమీఁద
మొల్లమిఁ గ్రమ్మఱ నవి మొలచీనా

(॥పోయిన॥)
వెడజాతిధర్మముల వెళ్ల దీనేటిగురుఁడు
ముడిఁగి అందునే మఱి ముణిఁగేదా
వొడిసి తొడమ వండి వూడిన ఫలములు
అడరి క్రమ్మర నందు నంటఁబోయీనా

(॥పోయిన॥)
శ్రీ వేంకటేశ్వరునిఁ జేరఁ జూపె గురుఁడు
దావతి యితరులఁ దడవేదా
భావించి పరుసవేది పసిఁడియైన లోహము
వేవేలైన తొల్లిటి విధ మయ్యీనా

(||pallavi||)
poyina baṁdhamu laḍu povum̐ gāga
sī yani rosi yĕṁgili segŏnedā

(||poyina||)
tŏlli sesinagarmālu tŏlam̐gam̐jesĕ gurum̐ḍu
sĕllam̐bo yiṁkā navi sesedā
vŏllaga vittulu tama vumugam̐ bāsinamīm̐da
mŏllamim̐ grammaṟa navi mŏlasīnā

(||poyina||)
vĕḍajādidharmamula vĕḽla dīneḍigurum̐ḍu
muḍim̐gi aṁdune maṟi muṇim̐gedā
vŏḍisi tŏḍama vaṁḍi vūḍina phalamulu
aḍari krammara naṁdu naṁṭam̐boyīnā

(||poyina||)
śhrī veṁkaḍeśhvarunim̐ jeram̐ jūbĕ gurum̐ḍu
dāvadi yidarulam̐ daḍavedā
bhāviṁchi parusavedi pasim̐ḍiyaina lohamu
vevelaina tŏlliḍi vidha mayyīnā