Poyim baalavamtidi poomsina tana mohamellaa

పొయిఁ బాలవంటిది పూఁచిన తన మోహమెల్లా
Language

(॥పల్లవి॥)
పొయిఁ బాలవంటిది పూఁచిన తన మోహమెల్లా
నయముల నెందాఁకా నానఁబెట్టవచ్చునే

(॥పొయి॥)
కన్నులఁ గన్నపుడే కందువచుట్టరికము
వున్నప్పుడెల్లా నూరకే వుండును తాను
చన్నులు మోఁపినప్పుడే జల్లనఁ బులకించును
యెన్నిక నల్లంతనుంటే యెఁతైనా గరఁగఁడు

(॥పొయి॥)
పిలిచినప్పుడే తన ప్రియవాదిపలుకులు
చలముననున్నపుడు సటలే తాను
తలఁచినప్పుడే తనతమకపువినోదాలు
మలసివున్నప్పుడైతే మానుపడివుండును

(॥పొయి॥)
గక్కనఁ గూడినప్పుడే ఘనమైనతనయింపు
తక్కినప్పుడు గొంటుఁదనమే తాను
యెక్కువతో శ్రీవేంకటేశుఁ డిప్పుడు నన్ను నేలె
చెక్కులునొక్కినవేళ చిరునవ్వు నవ్వును

(||pallavi||)
pŏyim̐ bālavaṁṭidi pūm̐sina tana mohamĕllā
nayamula nĕṁdām̐kā nānam̐bĕṭṭavachchune

(||pŏyi||)
kannulam̐ gannabuḍe kaṁduvasuṭṭarigamu
vunnappuḍĕllā nūrage vuṁḍunu tānu
sannulu mom̐pinappuḍe jallanam̐ bulagiṁchunu
yĕnniga nallaṁtanuṁṭe yĕm̐tainā garam̐gam̐ḍu

(||pŏyi||)
pilisinappuḍe tana priyavādibalugulu
salamunanunnabuḍu saḍale tānu
talam̐sinappuḍe tanadamagabuvinodālu
malasivunnappuḍaide mānubaḍivuṁḍunu

(||pŏyi||)
gakkanam̐ gūḍinappuḍe ghanamainadanayiṁpu
takkinappuḍu gŏṁṭum̐daname tānu
yĕkkuvado śhrīveṁkaḍeśhum̐ ḍippuḍu nannu nelĕ
sĕkkulunŏkkinaveḽa sirunavvu navvunu