పోవలె మాయింటికి పొద్దున మాకు
(॥పల్లవి॥)
పోవలె మాయింటికి పొద్దున మాకు
ఆవటించి వొక్కసారె అడుగరే మాట
(॥॥)
పిలిపించెనేఁటికి ప్రియము చెప్పఁగనేర
చెలువుఁడు నన్ను నేమి సేయుమనీనే
చల మొక్క టేకాని సాధించ నేనేర
అలరి యింకా నేమి అడుగరే మాట
(॥॥)
తానె వచ్చెనేఁటికి తలపోఁత నే నెఱుఁగ
పూనిపట్టి నాకు నేమి బుద్దిచెప్పీనే
మోన మొక్క టేకాని మొఱఁగులు నేనేర
ఆనవెట్టి మీరైనా అడుగరేమాఁట
(॥॥)
కాఁగిలించీనేఁటికే కాఁకసేయ నేనేర
యేఁగివచ్చి నామన సేమి చూచీనే
రాఁగయై శ్రీ వేంకటాద్రిరాయఁ డిట్టె నన్నుఁ గూడె
ఆఁగినతనగుట్టేమో అడుగరేమాట
(||pallavi||)
povalĕ māyiṁṭigi pŏdduna māgu
āvaḍiṁchi vŏkkasārĕ aḍugare māḍa
(||||)
pilibiṁchĕnem̐ṭigi priyamu sĕppam̐ganera
sĕluvum̐ḍu nannu nemi seyumanīne
sala mŏkka ṭegāni sādhiṁcha nenera
alari yiṁkā nemi aḍugare māḍa
(||||)
tānĕ vachchĕnem̐ṭigi talabom̐ta ne nĕṟum̐ga
pūnibaṭṭi nāgu nemi buddisĕppīne
mona mŏkka ṭegāni mŏṟam̐gulu nenera
ānavĕṭṭi mīrainā aḍugaremām̐ṭa
(||||)
kām̐giliṁchīnem̐ṭige kām̐kaseya nenera
yem̐givachchi nāmana semi sūsīne
rām̐gayai śhrī veṁkaḍādrirāyam̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
ām̐ginadanaguṭṭemo aḍugaremāḍa