పొత్తులను గఁడుగన పూనుకవచ్చితి నేను
(॥పల్లవి॥)
పొత్తులను గఁడుగన పూనుకవచ్చితి నేను
బత్తిసేయ వద్దంటినా పట్టకుమంటిఁ గాక
(॥పొత్తు॥)
సొలసి కన్నులఁ బతిఁ జూడఁగా వద్దంటినా
ఆలిగి వుప్పతించవద్దంటి గాక
మలయుచు నీవు మంచిమాటాడవద్దంటినా
వలవనినేరా లెంచవద్దంటిఁగాక
(॥పొత్తు॥)
కడ లేక పొందు సేయఁగా నే వద్దంటినా
వడివెట్టి పెనఁగఁగ వద్దంటీఁ గాక
చిడుముడిఁ గొలుపులు సేయఁగా వొద్దంటినా
వడదాఁక వెంటఁ దిప్పవద్దంటిఁ గాక
(॥పొత్తు॥)
కాంత యీతనికాఁగిటఁ గలయవొద్దంటిని
వంతల గుబ్బల నొత్తవద్దంటిఁ గాక
యింతలో శ్రీవేంకటేశుఁ డీతఁ డిట్టె నన్నుఁగూడె
వంతు వద్దంటినా జోలి వద్దంటిఁగాక
(||pallavi||)
pŏttulanu gam̐ḍugana pūnugavachchidi nenu
battiseya vaddaṁṭinā paṭṭagumaṁṭim̐ gāga
(||pŏttu||)
sŏlasi kannulam̐ badim̐ jūḍam̐gā vaddaṁṭinā
āligi vuppadiṁchavaddaṁṭi gāga
malayusu nīvu maṁchimāḍāḍavaddaṁṭinā
valavaninerā lĕṁchavaddaṁṭim̐gāga
(||pŏttu||)
kaḍa lega pŏṁdu seyam̐gā ne vaddaṁṭinā
vaḍivĕṭṭi pĕnam̐gam̐ga vaddaṁṭīm̐ gāga
siḍumuḍim̐ gŏlubulu seyam̐gā vŏddaṁṭinā
vaḍadām̐ka vĕṁṭam̐ dippavaddaṁṭim̐ gāga
(||pŏttu||)
kāṁta yīdanigām̐giḍam̐ galayavŏddaṁṭini
vaṁtala gubbala nŏttavaddaṁṭim̐ gāga
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ ḍiṭṭĕ nannum̐gūḍĕ
vaṁtu vaddaṁṭinā joli vaddaṁṭim̐gāga