పొత్తుల వలపు గద్దా భూమిలోనను వాసి
(॥పల్లవి॥)
పొత్తుల వలపు గద్దా భూమిలోనను వాసి-
కత్తెవైతే నీ వింత గయ్యాళింతువా
(॥పొత్తు॥)
అంగవించి నాతోనే ఆతఁడు మాటలాడఁగ
సంగడి జాణతనాలు సారె నాడేవే
చెంగట నప్పటి నాతో చేరి చేరి నవ్వఁగాను
యెంగిలి నవ్వులు నీవు యేల నవ్వేవే
(॥పొత్తు॥)
చెలువుఁడు నామీఁద చేతులు చాఁచఁగాను
చెలరేఁగి నీవేల చేతులొడ్డేవే
తిలకించి నన్నాతఁడు దిష్టించి చూఁడఁగాను
నెలవై అడ్డమువచ్చి నిలుచుండేవేమే
(॥పొత్తు॥)
శ్రీ వేంకటేశ్వరుఁడు చేరి నన్నుఁ గూడఁగాను
వావులు నీవేమి చెప్పవచ్చేవే యిందు
యీవల నలమేల్మంగ నిట్టె నన్ను మన్నించఁగ
కైవసమై అప్పటి చక్కట్లు చేప్పేవే
(||pallavi||)
pŏttula valabu gaddā bhūmilonanu vāsi-
kattĕvaide nī viṁta gayyāḽiṁtuvā
(||pŏttu||)
aṁgaviṁchi nādone ādam̐ḍu māḍalāḍam̐ga
saṁgaḍi jāṇadanālu sārĕ nāḍeve
sĕṁgaḍa nappaḍi nādo seri seri navvam̐gānu
yĕṁgili navvulu nīvu yela navveve
(||pŏttu||)
sĕluvum̐ḍu nāmīm̐da sedulu sām̐sam̐gānu
sĕlarem̐gi nīvela sedulŏḍḍeve
tilagiṁchi nannādam̐ḍu diṣhṭiṁchi sūm̐ḍam̐gānu
nĕlavai aḍḍamuvachchi nilusuṁḍeveme
(||pŏttu||)
śhrī veṁkaḍeśhvarum̐ḍu seri nannum̐ gūḍam̐gānu
vāvulu nīvemi sĕppavachcheve yiṁdu
yīvala nalamelmaṁga niṭṭĕ nannu manniṁcham̐ga
kaivasamai appaḍi sakkaṭlu seppeve