పొత్తుల మగువలకుఁ బోవునా యింక
(॥పల్లవి॥)
పొత్తుల మగువలకుఁ బోవునా యింక
యిత్తలఁ గూడుండుదము యీడ కిట్టేరావే
(॥పొత్తుల॥)
మచ్చరము నాకేలే మగఁడు మొదలనే
మచ్చికచేసి నిన్ను మన్నించునట
వెచ్చనూర్పు నీకేలే వెరపులింకానేలే
కుచ్చినేనూఁ గౌఁగిలించుకొనేఁ గాని రావే
(॥పొత్తుల॥)
వెంగెమాడ నాకేలే విభుఁడు వేడుకపడి
సింగారించి నిన్ను రట్టుసేసుఁ దానట
ముంగిటనే కొంకనేలే ముసిముసి నవ్వులేలే
సంగడిబూవానకు చలివాపీ రావే
(॥పొత్తుల॥)
పెనఁగఁగ నాకేలే ప్రియుడు లోలోనె వచ్చి
కనుసన్న సేసి నిన్నుఁ గలపునట
నను శ్రీవేంకటేశుఁడు నవ్వుతానిట్టెకూడె
తనిసిన రతులు చింతనసేసే రావే
(||pallavi||)
pŏttula maguvalagum̐ bovunā yiṁka
yittalam̐ gūḍuṁḍudamu yīḍa kiṭṭerāve
(||pŏttula||)
machcharamu nāgele magam̐ḍu mŏdalane
machchigasesi ninnu manniṁchunaḍa
vĕchchanūrbu nīgele vĕrabuliṁkānele
kuchchinenūm̐ gaum̐giliṁchugŏnem̐ gāni rāve
(||pŏttula||)
vĕṁgĕmāḍa nāgele vibhum̐ḍu veḍugabaḍi
siṁgāriṁchi ninnu raṭṭusesum̐ dānaḍa
muṁgiḍane kŏṁkanele musimusi navvulele
saṁgaḍibūvānagu salivābī rāve
(||pŏttula||)
pĕnam̐gam̐ga nāgele priyuḍu lolonĕ vachchi
kanusanna sesi ninnum̐ galabunaḍa
nanu śhrīveṁkaḍeśhum̐ḍu navvudāniṭṭĕgūḍĕ
tanisina radulu siṁtanasese rāve