Pottula magamdavu poruguna numdamga

పొత్తుల మగఁడవు పొరుగున నుండఁగ
Language

(॥పల్లవి॥)
పొత్తుల మగఁడవు పొరుగున నుండఁగ
తత్తర మింతేసి తమ కేలయ్యా

(॥పొత్తు॥)
యేపున నీమోము యిటు నేఁ జూచిన
చూపు లాపెమై చురుకనెను
ఆపొద్దు నీతో నాడినమాఁటల
తీపులు దనకటు తినఁ జేఁదాయ

(॥పొత్తు॥)
నడుమ నేనీతో నవ్వినవెన్నెల-
కడ నాపెకుఁ జీఁకటులాయ
చిడుముడి నే నినుఁ జెనకినసరసము
వెడవెడఁ దన కవి విరసములాయ

(॥పొత్తు॥)
వెస నామోవులవిందు నీకిడిన
పసిగొనినా పెకుఁ బగలాయ
యెసఁగిన శ్రీవేంకటేశ మమ్మిద్దరిఁ
గొసరి కూడితివి గురి దనకాయ

(||pallavi||)
pŏttula magam̐ḍavu pŏruguna nuṁḍam̐ga
tattara miṁtesi tama kelayyā

(||pŏttu||)
yebuna nīmomu yiḍu nem̐ jūsina
sūbu lābĕmai suruganĕnu
ābŏddu nīdo nāḍinamām̐ṭala
tībulu danagaḍu tinam̐ jem̐dāya

(||pŏttu||)
naḍuma nenīdo navvinavĕnnĕla-
kaḍa nābĕgum̐ jīm̐kaḍulāya
siḍumuḍi ne ninum̐ jĕnaginasarasamu
vĕḍavĕḍam̐ dana kavi virasamulāya

(||pŏttu||)
vĕsa nāmovulaviṁdu nīgiḍina
pasigŏninā pĕgum̐ bagalāya
yĕsam̐gina śhrīveṁkaḍeśha mammiddarim̐
gŏsari kūḍidivi guri danagāya