Porugugu vemgemaina pomdu lemtigi

పొరుగుకు వెంగెమైన పొందు లేఁటికి
Language

(॥పల్లవి॥)
పొరుగుకు వెంగెమైన పొందు లేఁటికి
విరసపువారెల్ల వింత సేసేరు

(॥పొరుగు॥)
చన్ను మొనలు నాఁటీని సారెఁ బైఁ బడకువయ్య
కన్నవిన్న వారందరు కడు దూరేరు
చిన్నిగోరు లిట్టె నాఁటీఁ జేతులు వట్టకువయ్య
నిన్నుఁ బొందే సతులెల్ల నేరాలు వేసేరు

(॥పొరుగు॥)
కొప్పు వాడుఁబువులంటీ కుచ్చి పెనఁగకువయ్య
చొప్పులెత్తి యెవ్వరైనా సోదించేరు
గొప్ప పిఱుఁదు తొడెత్తి కూచుండఁ బెట్టికువయ్య
యెప్పటి నీదేవుళ్లెల్ల యీసడించేరు

(॥పొరుగు॥)
మేనిచెమటలు ముంచీ మిక్కిలి రతులేలయ్య
నానఁబెట్టి సవతులు నవ్వు నవ్వేరు
యీనెపాన శ్రీ వేంకటేశ ననుఁ గూడితివి
వూని కడమవారెల్ల వుప్పటించేరు

(||pallavi||)
pŏrugugu vĕṁgĕmaina pŏṁdu lem̐ṭigi
virasabuvārĕlla viṁta seseru

(||pŏrugu||)
sannu mŏnalu nām̐ṭīni sārĕm̐ baim̐ baḍaguvayya
kannavinna vāraṁdaru kaḍu dūreru
sinnigoru liṭṭĕ nām̐ṭīm̐ jedulu vaṭṭaguvayya
ninnum̐ bŏṁde sadulĕlla nerālu veseru

(||pŏrugu||)
kŏppu vāḍum̐buvulaṁṭī kuchchi pĕnam̐gaguvayya
sŏppulĕtti yĕvvarainā sodiṁcheru
gŏppa piṟum̐du tŏḍĕtti kūsuṁḍam̐ bĕṭṭiguvayya
yĕppaḍi nīdevuḽlĕlla yīsaḍiṁcheru

(||pŏrugu||)
menisĕmaḍalu muṁchī mikkili radulelayya
nānam̐bĕṭṭi savadulu navvu navveru
yīnĕbāna śhrī veṁkaḍeśha nanum̐ gūḍidivi
vūni kaḍamavārĕlla vuppaḍiṁcheru