పల్లవి:
పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...
మిమ్మల్నే...
పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...
పగలంతా ఇద్దరకూ తగవులు ఎన్నున్నా...||2||
చీకటి పడితే పక్కకి చేరి రాజీ కొస్తాడు
కోరిన చీరలు ఇస్తాడు...
||పొరుగింటి మీనాక్షమ్మ||
పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే...
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే...
ఆండాళ్ళూ...
పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే...
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే..
తప్పని సరిగా ప్రతి సినిమాకు వెళతావూ ముందే..||2||
జీతం కాస్తా సినిమాకైతే మిగిలిదేముందే
చీరకు మిగిలేదేముందే...
||పొరుగింటి పుల్లయ్య||
చరణం 1:
పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు...
పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు...
తల్లీ తండ్రీ ప్రేమ గుర్తు గా పుట్టెను బుల్లి నామాలు ||2||
వగలను చూపిస్తారే గాని నగలెపుడైనా పెట్టారా ||2||
ఓ ముత్యాల బేసరి ఇచ్చి ముక్కుకి అందం తెచ్చారా....
నా ముక్కుకి అందం తెచ్చారా....
ఉద్యోగం ఒక మెట్టు దాటనీ కోరినదిస్తా నీకూ
ఇష్టం లేదని చెప్ప కూడదా ఎందుకు లెండి సాకు....
||పొరుగింటి మీనాక్షమ్మ||
చరణం 2:
మాటలతోటీ రెచ్చ గొట్టకే నన్నూ....
బెదిరింపులకు లొంగే దాన్ని కానూ...
కోపం వస్తే మనిషిని కాను నేనూ...
ఏం చేస్తారు..?
చెవులు మెలేస్తా..!! ఇంకేంచేస్తారు..?
దుంప తెంపేస్తా..!! ఆ తరువాతా..!!
తాట వొలుస్తా...!! హా హ హ హా....!!!
||పొరుగింటి మీనాక్షమ్మ||