Pori neegunu viṟigiboyina daanavulu

పొరి నీకును విఱిగిపోయిన దానవులు
Language

(॥పల్లవి॥)
పొరి నీకును విఱిగిపోయిన దానవులు
బిరుదులుడిగి వోడబేహారులైరి

(॥పొరి॥)
మకుటాలు దీసి జటామకుటాలు గట్టుకొని
వెకలి రిపులు మునివేషులైరి
మొకములను సోమపు మొకములు వెట్టుకొని
అకటా కొందరు రిపు లాటవారైరి

(॥పొరి॥)
పేరులు విడిచి సంకుఁబేరులు మెడ వేసుక
సారెకుఁ గొందరు శివసత్తులైరి
బీరపుసాములు మాని పెద్దగడసాము నేర్చి
తోరపుఁ బగతులెల్లా దొమ్మరులైరి

(॥పొరి॥)
నాదించ వెఱచి సింగినాదా లూదుకొంటాను
సోదించేరటాఁ గొందరు జోగులైరి
యీ దెస శ్రీవేంకటేశ యిన్నియు మాని కొందరు
దాదాత నీశరణని దాసరులైరి

(||pallavi||)
pŏri nīgunu viṟigiboyina dānavulu
biruduluḍigi voḍabehārulairi

(||pŏri||)
maguḍālu dīsi jaḍāmaguḍālu gaṭṭugŏni
vĕgali ribulu muniveṣhulairi
mŏgamulanu somabu mŏgamulu vĕṭṭugŏni
agaḍā kŏṁdaru ribu lāḍavārairi

(||pŏri||)
perulu viḍisi saṁkum̐berulu mĕḍa vesuga
sārĕgum̐ gŏṁdaru śhivasattulairi
bīrabusāmulu māni pĕddagaḍasāmu nersi
torabum̐ bagadulĕllā dŏmmarulairi

(||pŏri||)
nādiṁcha vĕṟasi siṁginādā lūdugŏṁṭānu
sodiṁcheraḍām̐ gŏṁdaru jogulairi
yī dĕsa śhrīveṁkaḍeśha yinniyu māni kŏṁdaru
dādāda nīśharaṇani dāsarulairi