పోరాని చుట్టరికము పొంచి యాతనికి నీకు
(॥పల్లవి॥)
పోరాని చుట్టరికము పొంచి యాతనికి నీకు
సారెఁ బ్రియము చెప్పగా సాదింతురటవే
(॥॥)
చిప్పిలఁ బతి నవ్వఁగా చెలి యేల జంకించేవే
కప్పురాన వేయఁ గాను కాఁకలేల చల్లేవే
కుప్పళించి మొక్కఁ గాను గొణఁగి యేల తిట్టేవే
వొప్పగు విడెమియ్యఁ గా నొల్లనందురటవే
(॥॥)
తగిలి నిన్నుఁ జూడఁ గా తలవంచుకొననేలే
సొగిసి గోర నూఁదగా సొలయనేలే
చిగురు మోవి ఇయ్యఁ గా సిగ్గులువడఁ గనేలే
తగవు సడపఁ గాను తమకింతురటవే
(॥॥)
పాపటకు దువ్వఁ గాను పంతములాడఁ గనేలే
చేపట్టి మన్నించఁగాను చిమ్మిరేఁగ నీకేలే
యేపున శ్రీ వేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
వోప రతిఁ జొక్కించఁగా నొడ్డుకొందురటవే
(||pallavi||)
porāni suṭṭarigamu pŏṁchi yādanigi nīgu
sārĕm̐ briyamu sĕppagā sādiṁturaḍave
(||||)
sippilam̐ badi navvam̐gā sĕli yela jaṁkiṁcheve
kappurāna veyam̐ gānu kām̐kalela salleve
kuppaḽiṁchi mŏkkam̐ gānu gŏṇam̐gi yela tiṭṭeve
vŏppagu viḍĕmiyyam̐ gā nŏllanaṁduraḍave
(||||)
tagili ninnum̐ jūḍam̐ gā talavaṁchugŏnanele
sŏgisi gora nūm̐dagā sŏlayanele
siguru movi iyyam̐ gā sigguluvaḍam̐ ganele
tagavu saḍabam̐ gānu tamagiṁturaḍave
(||||)
pābaḍagu duvvam̐ gānu paṁtamulāḍam̐ ganele
sebaṭṭi manniṁcham̐gānu simmirem̐ga nīgele
yebuna śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
voba radim̐ jŏkkiṁcham̐gā nŏḍḍugŏṁduraḍave