Poovulu muduvam batte poomsi simgaarimcham batte

పూవులు ముడువఁ బట్టె పూఁచి సింగారించఁ బట్టె
Language

(॥పల్లవి॥)
పూవులు ముడువఁ బట్టె పూఁచి సింగారించఁ బట్టె
యీవేళ గాచుక నీ వెట్టుండితివో కాని

(॥పూవు॥)
నీవు విచ్చే శుండఁగాను నే లోన జలక మాడి
తావళించి వచ్చుదాఁకాఁ దడ వాయఁగా
భావములోఁ దలఁచుక పాయకుండితిఁ జుమ్మీ నీఁ
వోవరిలో నెటువలె నుండితివో కాని

(॥పూవు॥)
వొక్కడవే వుండఁగాను వొప్పుగ సొమ్ములు వెట్టి
తక్కక నే వచ్చుదాఁకాఁ దడ వాయఁగా
చొక్కుచు నీవుంగరమే చూచుకొంటా నుంటిఁజుమ్మీ
చిక్కిన నీ విక్కడ నేమి సేసితివో కాని

(॥పూవు॥)
కగ్గి నీ వెదురుచడఁగా వొడ లోముకొంటా
దగ్గరి నే వచ్చుదాఁకాఁ దడ వాయఁగా
నిగ్గుల శ్రీ వేంకటేశ నీయిచ్చఁ గూడితిఁ జుమ్మీ
యెగ్గులెల్లా నిందుఁ దీరె నేమనేవో కాని

(||pallavi||)
pūvulu muḍuvam̐ baṭṭĕ pūm̐si siṁgāriṁcham̐ baṭṭĕ
yīveḽa gāsuga nī vĕṭṭuṁḍidivo kāni

(||pūvu||)
nīvu vichche śhuṁḍam̐gānu ne lona jalaga māḍi
tāvaḽiṁchi vachchudām̐kām̐ daḍa vāyam̐gā
bhāvamulom̐ dalam̐suga pāyaguṁḍidim̐ jummī nīm̐
vovarilo nĕḍuvalĕ nuṁḍidivo kāni

(||pūvu||)
vŏkkaḍave vuṁḍam̐gānu vŏppuga sŏmmulu vĕṭṭi
takkaga ne vachchudām̐kām̐ daḍa vāyam̐gā
sŏkkusu nīvuṁgarame sūsugŏṁṭā nuṁṭim̐jummī
sikkina nī vikkaḍa nemi sesidivo kāni

(||pūvu||)
kaggi nī vĕdurusaḍam̐gā vŏḍa lomugŏṁṭā
daggari ne vachchudām̐kām̐ daḍa vāyam̐gā
niggula śhrī veṁkaḍeśha nīyichcham̐ gūḍidim̐ jummī
yĕggulĕllā niṁdum̐ dīrĕ nemanevo kāni