Poovula vesinavaarim boomsi raada vedurade

పూవుల వేసినవారిఁ బూఁచి రాత వేతురటే
Language

(॥పల్లవి॥)
పూవుల వేసినవారిఁ బూఁచి రాత వేతురటే
కావలసినట్లయ్యీ గర్వ మేలే నీకు

(॥పవుల॥)
మంచిమాటల నాతఁడుమచ్చిక చల్లఁగానే
వంచుకొనేవు శిరసు వద్దే యింత
మంచముపై జేతి కాకు మడి చియ్యఁగానే
తుంచి తుంచి వేసేవు తుచ్చ మేలే నీకు

(॥పవుల॥)
నమ్మిక లిచ్చి యాతఁడు నవ్వు నవ్వఁగానే
బొమ్మల జంకించేవు పొసఁగునటే
కమ్మర నట్టే నీపైఁ గప్పురము చల్లరాగా
యిమ్ముల నానలు వెట్టే వెమ్మె లేలే నీకు

(॥పవుల॥)
యిక్కువ లంటి శ్రీవేంకటేశుఁ డిట్టె కూడఁగానే
పిక్కటిల్లఁ బెనఁగేవు బీర మింతేలే
కక్కసించి యాతఁడే కౌఁగిట బలిమిఁ గూడె
వొక్కటై పంత మాడేవు వొర టేలే నీకు

(||pallavi||)
pūvula vesinavārim̐ būm̐si rāda veduraḍe
kāvalasinaṭlayyī garva mele nīgu

(||pavula||)
maṁchimāḍala nādam̐ḍumachchiga sallam̐gāne
vaṁchugŏnevu śhirasu vadde yiṁta
maṁchamubai jedi kāgu maḍi siyyam̐gāne
tuṁchi tuṁchi vesevu tuchcha mele nīgu

(||pavula||)
nammiga lichchi yādam̐ḍu navvu navvam̐gāne
bŏmmala jaṁkiṁchevu pŏsam̐gunaḍe
kammara naṭṭe nībaim̐ gappuramu sallarāgā
yimmula nānalu vĕṭṭe vĕmmĕ lele nīgu

(||pavula||)
yikkuva laṁṭi śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ kūḍam̐gāne
pikkaḍillam̐ bĕnam̐gevu bīra miṁtele
kakkasiṁchi yādam̐ḍe kaum̐giḍa balimim̐ gūḍĕ
vŏkkaḍai paṁta māḍevu vŏra ṭele nīgu