Poovula vesinavaari boggida veduraa

పూవుల వేసినవారి బొగ్గిట వేతురా
Language

(॥పల్లవి॥)
పూవుల వేసినవారి బొగ్గిట వేతురా
నీ వేమి సేసినాను నిండ నవ్వీ నతఁడు

(॥పూవుల॥)
కాని కాని తిట్టు కాఁకలతో వొట్లు
మానుమన్నా మానవేలే మాటిమాఁటికి
పూనినట్టి మొక్కులూ పూఁటపూఁట చొక్కులూ
తేనెలమాటల నిన్నుఁ దీవించీ నతఁడు

(॥పూవుల॥)
పనిలేనినేరాలు పలుకుల కారాలు
అనకుమన్నా విడువ వంతకంతకు
తనివోనివలపులు తరితీపుసొలపులు
ననుపుఁ గూరిమి నిన్ను నాఁటించీ నతఁడు

(॥పూవుల॥)
కాంతలతో పంతనాలు కాఁగిటిలో మంతనాలు
యెంతయినాఁ బోనీవు యింత యేఁటికే
యింతటికి వేంకటేశుఁ డిట్టె నిన్నుఁ గూడె
సంతతము నీకు నిట్టె చనవిచ్చె నతఁడు

(||pallavi||)
pūvula vesinavāri bŏggiḍa vedurā
nī vemi sesinānu niṁḍa navvī nadam̐ḍu

(||pūvula||)
kāni kāni tiṭṭu kām̐kalado vŏṭlu
mānumannā mānavele māḍimām̐ṭigi
pūninaṭṭi mŏkkulū pūm̐ṭabūm̐ṭa sŏkkulū
tenĕlamāḍala ninnum̐ dīviṁchī nadam̐ḍu

(||pūvula||)
panileninerālu palugula kārālu
anagumannā viḍuva vaṁtagaṁtagu
tanivonivalabulu taridībusŏlabulu
nanubum̐ gūrimi ninnu nām̐ṭiṁchī nadam̐ḍu

(||pūvula||)
kāṁtalado paṁtanālu kām̐giḍilo maṁtanālu
yĕṁtayinām̐ bonīvu yiṁta yem̐ṭige
yiṁtaḍigi veṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
saṁtadamu nīgu niṭṭĕ sanavichchĕ nadam̐ḍu