Poovula vaasanalellaa punumguna battinattu

పూవుల వాసనలెల్లా పుణుఁగున బట్టినట్టు
Language

(॥పల్లవి॥)
పూవుల వాసనలెల్లా పుణుఁగున బట్టినట్టు
వావులే మీలో మీకు వైపులాయనయ్యా

(॥పూవు॥)
కొలఁది మీర నీకింతి కొలువులు సేయఁగాను
నిలిచి యాపెమోము నీవు చూడఁగా
వలపు తీఁగెలువారి వరుస మీ యిద్దరికి
అలరి మీకాఁగిళ్ల నల్లుకొనెనయ్యా

(॥పూవు॥)
పచ్చిదేర నీతో నాకె పలుమారు మాటాడఁగా
విచ్చన విడిగా నీవు వినఁగాను
కుచ్చి మీమనసు లివి గుదిగొనఁ జిగిరించి
తచ్చి మోవులలో నేస్తాలు సేసీనయ్యా

(॥పూవు॥)
అక్కునఁ దిరమై నీకు నలమేల్ మంగ వుండఁగా
దక్క సొమ్ములలో నీవు దాఁచుకుండఁగా
పక్కన మీకోరికలు ఫలించి శ్రీవేంకటేశ
చొక్కపుమీరతు లీడుజోడాయనయ్యా

(||pallavi||)
pūvula vāsanalĕllā puṇum̐guna baṭṭinaṭṭu
vāvule mīlo mīgu vaibulāyanayyā

(||pūvu||)
kŏlam̐di mīra nīgiṁti kŏluvulu seyam̐gānu
nilisi yābĕmomu nīvu sūḍam̐gā
valabu tīm̐gĕluvāri varusa mī yiddarigi
alari mīgām̐giḽla nallugŏnĕnayyā

(||pūvu||)
pachchidera nīdo nāgĕ palumāru māḍāḍam̐gā
vichchana viḍigā nīvu vinam̐gānu
kuchchi mīmanasu livi gudigŏnam̐ jigiriṁchi
tachchi movulalo nestālu sesīnayyā

(||pūvu||)
akkunam̐ diramai nīgu nalamel maṁga vuṁḍam̐gā
dakka sŏmmulalo nīvu dām̐suguṁḍam̐gā
pakkana mīgorigalu phaliṁchi śhrīveṁkaḍeśha
sŏkkabumīradu līḍujoḍāyanayyā