Poovudammulu marumdu poomsinaam demaramdu

పూవుటమ్ములు మరుఁడు పూఁచినాఁ డేమరఁడు
Language

(॥పల్లవి॥)
పూవుటమ్ములు మరుఁడు పూఁచినాఁ డేమరఁడు
రావే నామాఁట విని రవ్వపడనేఁటికే

(॥పవు॥)
వద్దు నీచలము వలపించఁగలము! నీ
కొద్ది దెలిసిన దాఁకా గొంకే మింతే
అద్దొ యిటువలె నలిగేవా నెంతలేదు
చద్దికి వేఁడికి నవి సాగ వింతేకాక

(॥పవు॥)
యింతేలే నీకోపము యిందు కెల్లా నోపము! నీ-
పంతము చూచినదాఁకా పాటించే నింతే
యెంతో బిగువుతోడ యెలయించే దెంతలేదు
సంతతము పతి వద్ద జరగదుగాక

(॥పవు॥)
మానవే నీబిరుదు మాకు నివి యరుదు
నానఁబెట్టి కొంతవడి నవ్వితి నింతే
నేనే శ్రీవేంకటగిరినిలయుఁడఁ గూడితిని
దానికేమి నీకు నాకుఁ దగు లింతేకాక

(||pallavi||)
pūvuḍammulu marum̐ḍu pūm̐sinām̐ ḍemaram̐ḍu
rāve nāmām̐ṭa vini ravvabaḍanem̐ṭige

(||pavu||)
vaddu nīsalamu valabiṁcham̐galamu! nī
kŏddi dĕlisina dām̐kā gŏṁke miṁte
addŏ yiḍuvalĕ naligevā nĕṁtaledu
saddigi vem̐ḍigi navi sāga viṁtegāga

(||pavu||)
yiṁtele nīgobamu yiṁdu kĕllā nobamu! nī-
paṁtamu sūsinadām̐kā pāḍiṁche niṁte
yĕṁto biguvudoḍa yĕlayiṁche dĕṁtaledu
saṁtadamu padi vadda jaragadugāga

(||pavu||)
mānave nībirudu māgu nivi yarudu
nānam̐bĕṭṭi kŏṁtavaḍi navvidi niṁte
nene śhrīveṁkaḍagirinilayum̐ḍam̐ gūḍidini
dānigemi nīgu nāgum̐ dagu liṁtegāga