Poovaga poosem gonni podali kaavaga kaase

పూవక పూచెఁ గొన్ని పొదలి కావక కాచె
Language

(॥పల్లవి॥)
పూవక పూచెఁ గొన్ని పొదలి కావక కాచె
రావలసినప్పుడు తా రమ్మనవే

(॥పూవ॥)
మనసురానివారు మాటలు చెప్పఁగఁబోతే
వినఁ జవిగా వవి విడుమనవే
చనవులేనివారు సలిగెలఁ బొరలితే
యెనసీనా వట్టిపొందు లిఁక నేఁటికే

(॥పూవ॥)
పొంతనాలు లేనివారు పొంచి యెంత వద్దనున్నా
వింతతో నెరవేరవే విడుమనవే
చెంత పొందువోనివారు జిగి నెంత పిలిచినా
సంతమౌనా యిఁక వట్టి సట లేఁటికే

(॥పూవ॥)
ఆలుచాలనివారు అంగము లెంత ముట్టినా
వేసటలై తోఁచు నవి విడుమనవే
యీసుదీర శ్రీవేంకటేశుఁ డిదె నన్నుఁ గూడె
సేసపాలనాఁటిమాఁట చెల్లుననవే

(||pallavi||)
pūvaga pūsĕm̐ gŏnni pŏdali kāvaga kāsĕ
rāvalasinappuḍu tā rammanave

(||pūva||)
manasurānivāru māḍalu sĕppam̐gam̐bode
vinam̐ javigā vavi viḍumanave
sanavulenivāru saligĕlam̐ bŏralide
yĕnasīnā vaṭṭibŏṁdu lim̐ka nem̐ṭige

(||pūva||)
pŏṁtanālu lenivāru pŏṁchi yĕṁta vaddanunnā
viṁtado nĕraverave viḍumanave
sĕṁta pŏṁduvonivāru jigi nĕṁta pilisinā
saṁtamaunā yim̐ka vaṭṭi saḍa lem̐ṭige

(||pūva||)
ālusālanivāru aṁgamu lĕṁta muṭṭinā
vesaḍalai tom̐su navi viḍumanave
yīsudīra śhrīveṁkaḍeśhum̐ ḍidĕ nannum̐ gūḍĕ
sesabālanām̐ṭimām̐ṭa sĕllunanave