Poovaga poose veerigi podigoni valabulu

పూవక పూచె వీరికి పొదిగొని వలపులు
Language

(॥పల్లవి॥)
పూవక పూచె వీరికి పొదిగొని వలపులు
చేవదేర మాతోనే చెప్పేరు యీ సుద్దులు

(॥పూవ॥)
చన్నుల నొత్తితేఁ దనజంటమేను గందెనట
కన్నులచూపులే ఆపెఁ గాఁడెనట
యెన్నివేసాలు సేసేరు యేమిచెప్పేమమ్మ నీతో
విన్నప్పటనుండి మాకు వెరగయ్యీ సుద్దులు

(॥పూవ॥)
మోవి సోఁకితే నాతని మొనలెల్లా రాఁగెనట
కావిజంకెన లాపెఁ గదిమెనట
యేవంక చూచిన వీరియెమ్మెలే వెగ్గళమాయ
నూవుగింజ నానదిదె నోటిలో నీసుద్దులు

(॥పూవ॥)
చేయిచాఁచితే ననిచె శ్రీవేంకటేశ్వరుకట
కాయము చెమరించె నాకాంతకునట
యీయెడ నన్నిటు గూడె యెవ్వరి నేమనవచ్చు
బాయిలిపందిలులాయ పంతపు యీసుద్దులు

(||pallavi||)
pūvaga pūsĕ vīrigi pŏdigŏni valabulu
sevadera mādone sĕpperu yī suddulu

(||pūva||)
sannula nŏttidem̐ danajaṁṭamenu gaṁdĕnaḍa
kannulasūbule ābĕm̐ gām̐ḍĕnaḍa
yĕnnivesālu seseru yemisĕppemamma nīdo
vinnappaḍanuṁḍi māgu vĕragayyī suddulu

(||pūva||)
movi som̐kide nādani mŏnalĕllā rām̐gĕnaḍa
kāvijaṁkĕna lābĕm̐ gadimĕnaḍa
yevaṁka sūsina vīriyĕmmĕle vĕggaḽamāya
nūvugiṁja nānadidĕ noḍilo nīsuddulu

(||pūva||)
seyisām̐side nanisĕ śhrīveṁkaḍeśhvarugaḍa
kāyamu sĕmariṁchĕ nāgāṁtagunaḍa
yīyĕḍa nanniḍu gūḍĕ yĕvvari nemanavachchu
bāyilibaṁdilulāya paṁtabu yīsuddulu