పూఁచిపట్టి యీయింతిఁ బొగడరమ్మా
(॥పల్లవి॥)
పూఁచిపట్టి యీయింతిఁ బొగడరమ్మా
కోఁచక మేఘములోని క్రొమ్మెఱుఁగు వలెను
(॥పూఁచి॥)
చెమటఁ గస్తూరి బొట్టు చెదరి చెక్కుల జారీఁ
నమరఁ బోలుచరమ్మ అంగన కిది
తమితోడ నీపె ముందె దంతియానగనక యీఁ
సమయాన మదములు జారినట్లున్నవి
(॥పూఁచి॥)
కలికి కొప్పుననుండి కమ్మనివిరులు రాలీ
చెలఁగి యేమనవచ్చుఁ జెప్పరే యమ్మ
పొలఁతి లతాంగిగాన పువ్వులు నిలువునను
జలజలరాలినట్టిసంగతాయ నిదివో
(॥పూఁచి॥)
కాఁగిట శ్రీవేంకటేశుఁ గమ్ముకొని విఱ్ఱవీఁగీ
పాఁగినయీభావములు పలుకరమ్మా
దాఁగక కలువయునుఁ దామరయుఁ బెనగొని
మూఁగిన పరిమళము ముంచినట్లున్నవి
(||pallavi||)
pūm̐sibaṭṭi yīyiṁtim̐ bŏgaḍarammā
kom̐saga meghamuloni krŏmmĕṟum̐gu valĕnu
(||pūm̐si||)
sĕmaḍam̐ gastūri bŏṭṭu sĕdari sĕkkula jārīm̐
namaram̐ bolusaramma aṁgana kidi
tamidoḍa nībĕ muṁdĕ daṁtiyānaganaga yīm̐
samayāna madamulu jārinaṭlunnavi
(||pūm̐si||)
kaligi kŏppunanuṁḍi kammanivirulu rālī
sĕlam̐gi yemanavachchum̐ jĕppare yamma
pŏlam̐ti ladāṁgigāna puvvulu niluvunanu
jalajalarālinaṭṭisaṁgadāya nidivo
(||pūm̐si||)
kām̐giḍa śhrīveṁkaḍeśhum̐ gammugŏni viṭravīm̐gī
pām̐ginayībhāvamulu palugarammā
dām̐gaga kaluvayunum̐ dāmarayum̐ bĕnagŏni
mūm̐gina parimaḽamu muṁchinaṭlunnavi