Poomsi poomsi nee gunaale pogadem gaaga

పూఁచి పూఁచి నీ గుణాలే పొగడేఁ గాక
Language

(॥పల్లవి॥)
పూఁచి పూఁచి నీ గుణాలే పొగడేఁ గాక
దాఁచుకొని చెలులతోఁ దడవకుండేనా

(॥పూఁచి॥)
నివ్వటిల్ల నందరిలో నీకు వేడుకైతేఁజాలు
యెవ్వతెఁ దెచ్చుకొన్నా నితవే నాకు
వువ్విళ్ళూర నీమనసు వొడఁబడితేఁజాలు
యివ్వల నీ చేఁతలకు నెగ్గుపట్టేనా

(॥పూఁచి॥)
చక్కఁగా నీ కిటువలె సంతోసమైతేఁజాలు
యెక్కడ నుండి వచ్చినా నితవే నాకు
పెక్కువిధముల నీకుఁ బెద్దరికమైతేఁజాలు
తక్కక నీ యాచారాలు తప్పువట్టేనా

(॥పూఁచి॥)
వింతలుగా నీకింత వినోదమైతేఁజాలు
యెంత సరసమాడినా నితవే నాకు
పొంతనే శ్రీవేంకటేశ పొసఁగి న న్నేలితివి
రంతుల నీ తమకము రచ్చవేసేనా

(||pallavi||)
pūm̐si pūm̐si nī guṇāle pŏgaḍem̐ gāga
dām̐sugŏni sĕluladom̐ daḍavaguṁḍenā

(||pūm̐si||)
nivvaḍilla naṁdarilo nīgu veḍugaidem̐jālu
yĕvvadĕm̐ dĕchchugŏnnā nidave nāgu
vuvviḽḽūra nīmanasu vŏḍam̐baḍidem̐jālu
yivvala nī sem̐talagu nĕggubaṭṭenā

(||pūm̐si||)
sakkam̐gā nī kiḍuvalĕ saṁtosamaidem̐jālu
yĕkkaḍa nuṁḍi vachchinā nidave nāgu
pĕkkuvidhamula nīgum̐ bĕddarigamaidem̐jālu
takkaga nī yāsārālu tappuvaṭṭenā

(||pūm̐si||)
viṁtalugā nīgiṁta vinodamaidem̐jālu
yĕṁta sarasamāḍinā nidave nāgu
pŏṁtane śhrīveṁkaḍeśha pŏsam̐gi na nnelidivi
raṁtula nī tamagamu rachchavesenā