Pooja lamdarum jesede pushpayaagamu

పూజ లందరుఁ జేసేదే పుష్పయాగము
Language

(॥పల్లవి॥)
పూజ లందరుఁ జేసేదే పుష్పయాగము
ఆజి నర్జునుఁడు చేసినది పుష్పయాగము

(॥పూజ॥)
మొదల శ్రీసతిచేతి మోవానకమలమే
పొదల నీకెపుడును పుష్పయాగము
గుదిగొన మిమ్మిద్దరిఁ గూడించే మరువిరులు
పొదిగి పూజించిన పుష్పయాగము

(॥పూజ॥)
మాలాకారుఁ డిచ్చిన మధురలో పూదండ
పోలింప నీకు నదె పుష్పయాగము
కేలితో నారదుఁ డొసగిన పుష్పయాగము
భూలోకమున నీకుఁ బుష్పయాగము

(॥పూజ॥)
తొరలి అలమేల్మంగతురుమువిరులే నీకు
పొరసి నీవురముపై పుష్పయాగము
సిరులతో మునులెల్ల శ్రీవేంకటాద్రీశ నీకు
పారిఁ బొరిఁ జేసేరు పుష్పయాగము

(||pallavi||)
pūja laṁdarum̐ jesede puṣhpayāgamu
āji narjunum̐ḍu sesinadi puṣhpayāgamu

(||pūja||)
mŏdala śhrīsadisedi movānagamalame
pŏdala nīgĕbuḍunu puṣhpayāgamu
gudigŏna mimmiddarim̐ gūḍiṁche maruvirulu
pŏdigi pūjiṁchina puṣhpayāgamu

(||pūja||)
mālāgārum̐ ḍichchina madhuralo pūdaṁḍa
poliṁpa nīgu nadĕ puṣhpayāgamu
kelido nāradum̐ ḍŏsagina puṣhpayāgamu
bhūlogamuna nīgum̐ buṣhpayāgamu

(||pūja||)
tŏrali alamelmaṁgadurumuvirule nīgu
pŏrasi nīvuramubai puṣhpayāgamu
sirulado munulĕlla śhrīveṁkaḍādrīśha nīgu
pārim̐ bŏrim̐ jeseru puṣhpayāgamu