Ponnalalo vegem boddu poneeve yimka

పొన్నలలో వేగెఁ బొద్దు పోనీవే యిఁక
Language

(॥పల్లవి॥)
పొన్నలలో వేగెఁ బొద్దు పోనీవే యిఁక
కన్నదే కంటి గురుమ కానీవే యింక

(॥॥)
పంచించి యెందు వోయినా వచ్చీఁగానీ తా నీడకు
పొంచి యానలువెట్టక పోనీవే యింక
యెంచరాదు పంచరాదు యివే మింటిపై చుక్కలు
కంచు పెంచుమాటలాడీ కానీవే ఇంక

(॥॥)
యీరీతి మాయింటిగుఱు తెఱఁగఁడా తానేమి
పోరి సారెఁ బిలువక పోనీవే యింక
నీరులేదు మేరులేదు నిండినయొండమావులు
కారపువలపు చల్లీఁ గానీవే యింక

(॥॥)
యెందుండి వచ్చినారానీ యేమనినా నియ్యకొనే
పొందులెల్ల నొనగుడె పోనివే యిఁక
విందువలె శ్రీ వెంకటవిభుఁడు నన్నుఁ గలసె
కందుకుందులెల్లాఁ బాసె కానీవే ఇంక

(||pallavi||)
pŏnnalalo vegĕm̐ bŏddu ponīve yim̐ka
kannade kaṁṭi guruma kānīve yiṁka

(||||)
paṁchiṁchi yĕṁdu voyinā vachchīm̐gānī tā nīḍagu
pŏṁchi yānaluvĕṭṭaga ponīve yiṁka
yĕṁcharādu paṁcharādu yive miṁṭibai sukkalu
kaṁchu pĕṁchumāḍalāḍī kānīve iṁka

(||||)
yīrīdi māyiṁṭiguṟu tĕṟam̐gam̐ḍā tānemi
pori sārĕm̐ biluvaga ponīve yiṁka
nīruledu meruledu niṁḍinayŏṁḍamāvulu
kārabuvalabu sallīm̐ gānīve yiṁka

(||||)
yĕṁduṁḍi vachchinārānī yemaninā niyyagŏne
pŏṁdulĕlla nŏnaguḍĕ ponive yim̐ka
viṁduvalĕ śhrī vĕṁkaḍavibhum̐ḍu nannum̐ galasĕ
kaṁduguṁdulĕllām̐ bāsĕ kānīve iṁka