Ponimmani vooragunnaam boddu voddu nannu remsee

పోనిమ్మని వూరకున్నాఁ బొద్దు వొద్దు నన్ను రేఁచీ
Language

(॥పల్లవి॥)
పోనిమ్మని వూరకున్నాఁ బొద్దు వొద్దు నన్ను రేఁచీ
తానే నిజమరియైతేఁ దనకేలే వెఱపు

(॥పోని॥)
తప్పని బొంకనివాఁడు తానేలాన వెట్టుకొనీ
చిప్పిలు పెంజెమటలు చెక్కులఁ గార
యిప్పు డింతేసివాసు లెక్కించుక వచ్చేవాఁడు
తప్పక చూడనేలే దానివంక నపుడు

(॥పోని॥)
తారుకాణించేవాఁడు తానేల తలవంచీని
నారుకొన్న ముసిముసి నవ్వుల తోడ
బీరమున నిప్పుడింత పెనఁగేటి వాఁడైతే
నేరుపుతో దానివద్ద నిలుచుండ నేలే

(॥పోని॥)
తానే కాఁగిలించేవాఁడు తతి నుస్సురన నేలే
ఆనుక లోలోనే తా నలసుకొంటా
యీనయాన శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁగూడె
కానకుండా దానితోడఁ గన్నుసన్న లేలే

(||pallavi||)
ponimmani vūragunnām̐ bŏddu vŏddu nannu rem̐sī
tāne nijamariyaidem̐ danagele vĕṟabu

(||poni||)
tappani bŏṁkanivām̐ḍu tānelāna vĕṭṭugŏnī
sippilu pĕṁjĕmaḍalu sĕkkulam̐ gāra
yippu ḍiṁtesivāsu lĕkkiṁchuga vachchevām̐ḍu
tappaga sūḍanele dānivaṁka nabuḍu

(||poni||)
tārugāṇiṁchevām̐ḍu tānela talavaṁchīni
nārugŏnna musimusi navvula toḍa
bīramuna nippuḍiṁta pĕnam̐geḍi vām̐ḍaide
nerubudo dānivadda nilusuṁḍa nele

(||poni||)
tāne kām̐giliṁchevām̐ḍu tadi nussurana nele
ānuga lolone tā nalasugŏṁṭā
yīnayāna śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐gūḍĕ
kānaguṁḍā dānidoḍam̐ gannusanna lele