పోనీపోనీ ఇకనేల పోయిన నీళ్లకుఁ గట్ట
(॥పల్లవి॥)
పోనీపోనీ ఇకనేల పోయిన నీళ్లకుఁ గట్ట
నేనే యింతకు జొచ్చితే నిన్నుఁ బారనిత్తునా
(॥పోనీ॥)
పదవోయి నీమాఁటపట్టు నీకే వచ్చెను
వదల కెప్పుడును నీవారమే నేము
కదిసి నీవిందు కొరకా వలపించితివి
యిది నే నెఱిఁగితేను యింతా మెచ్చుసేయనా
(॥పోనీ॥)
చాలునోయి యిందాఁకా నీసరితలే చూచితిమి
యీలాగుల నీకు నే మీఁదెత్తితి మేను
తాలిమి నీచేసన్న లింతకు వచ్చెనా నేఁడు
నాలినీగుణము గంటే నాఁడే మెచ్చుసేయనా
(॥పోనీ॥)
తగునోయి నీకు-నాకు దతివచ్చె మితివచ్చె
మొగి నిన్ను నేడఁగన్నా మొక్కేము నేము
అగడు శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
నిగిడి నన్నుఁ గూడితి నీకె మెచ్చుసేయనా
(||pallavi||)
ponībonī iganela poyina nīḽlagum̐ gaṭṭa
nene yiṁtagu jŏchchide ninnum̐ bāranittunā
(||ponī||)
padavoyi nīmām̐ṭabaṭṭu nīge vachchĕnu
vadala kĕppuḍunu nīvārame nemu
kadisi nīviṁdu kŏragā valabiṁchidivi
yidi ne nĕṟim̐gidenu yiṁtā mĕchchuseyanā
(||ponī||)
sālunoyi yiṁdām̐kā nīsaridale sūsidimi
yīlāgula nīgu ne mīm̐dĕttidi menu
tālimi nīsesanna liṁtagu vachchĕnā nem̐ḍu
nālinīguṇamu gaṁṭe nām̐ḍe mĕchchuseyanā
(||ponī||)
tagunoyi nīgu-nāgu dadivachchĕ midivachchĕ
mŏgi ninnu neḍam̐gannā mŏkkemu nemu
agaḍu śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
nigiḍi nannum̐ gūḍidi nīgĕ mĕchchuseyanā