Pommamtem gaani voorage poyivachchenamtenu

పొమ్మంటేఁ గాని వూరకే పోయివచ్చేనంటేను
Language

(॥పల్లవి॥)
పొమ్మంటేఁ గాని వూరకే పోయివచ్చేనంటేను
సమ్మతించలేనోయి సంగడీఁడ

(॥పొమ్మం॥)
యిత్తల నీవు నేను యిటు గూడినకూటమి
చిత్తాన మఱవకుమీ చెలికాఁడ
మత్తిలి నీవు నేఁడే మాపటంత రాకుంటే
వత్తుఁజుమ్మీ మీయింటికి వగకాఁడా

(॥పొమ్మం॥)
ఆవేళ నీవు నేను ఆడుకోలుమాటలెల్లా
నీవే తలఁచుకొమ్మీ నేస్తకాఁడా
యేవంక చూచినా యిప్పుడు కోమటిమేన
వావిసుమ్మీ నీకు నాకు వన్నెకాఁడా

(॥పొమ్మం॥)
వాకిటికిఁబోయి యిటువచ్చి నన్నుఁగూడితివి
నాకంటే మేలుగదోయి నాటకీఁడా
చేకొని శ్రీవేంకటేశ చెల్లుఁజెల్లు యిది నీకు
యేకాలముఁ బాయకుమీ యిచ్చకీఁడా

(||pallavi||)
pŏmmaṁṭem̐ gāni vūrage poyivachchenaṁṭenu
sammadiṁchalenoyi saṁgaḍīm̐ḍa

(||pŏmmaṁ||)
yittala nīvu nenu yiḍu gūḍinagūḍami
sittāna maṟavagumī sĕligām̐ḍa
mattili nīvu nem̐ḍe mābaḍaṁta rāguṁṭe
vattum̐jummī mīyiṁṭigi vagagām̐ḍā

(||pŏmmaṁ||)
āveḽa nīvu nenu āḍugolumāḍalĕllā
nīve talam̐sugŏmmī nestagām̐ḍā
yevaṁka sūsinā yippuḍu komaḍimena
vāvisummī nīgu nāgu vannĕgām̐ḍā

(||pŏmmaṁ||)
vāgiḍigim̐boyi yiḍuvachchi nannum̐gūḍidivi
nāgaṁṭe melugadoyi nāḍagīm̐ḍā
segŏni śhrīveṁkaḍeśha sĕllum̐jĕllu yidi nīgu
yegālamum̐ bāyagumī yichchagīm̐ḍā