Pomka vettinappude pomduga ne naala naidi

పోఁక వెట్టినప్పుడే పొందుగ నే నాల నైతి
Language

(॥పల్లవి॥)
పోఁక వెట్టినప్పుడే పొందుగ నే నాల నైతి
సోఁకోరిచి వుండితేనే చుట్టమయ్యీఁ గాక

(॥॥)
యేమి సేసినాఁ దన కెదురాడేదాననా
మోము చూచి చేతు లెత్తి మొక్కీఁగాక
వాములైన వలపులు వడివెట్ట వచ్చునా
ప్రేమముతో తానే వచ్చి పెండ్లాడీఁ గాక

(॥॥)
యెవ్వతెఁ దెచ్చుకొనినా యెగ్గుపట్టే దాననా
నవ్వుతా నెడ మాటలు నడపీఁగాక
జవ్వనము తన సొమ్ము జల్లిఁ బట్ట వచ్చునా
చివ్వనఁ దానే నాపై సేసవెట్టీఁ గాక

(॥॥)
యెప్పుడు దా విచ్చేసినా యెడనుంటి వనేనా
వొప్పి కౌఁగిలించి యిట్టే వొనరేఁగాక
నెప్పున శ్రీ వేంకటనిలయుఁడు నన్నుఁగూడె
కప్పి తానే కంకణము గట్టీఁ గాకా

(||pallavi||)
pom̐ka vĕṭṭinappuḍe pŏṁduga ne nāla naidi
som̐korisi vuṁḍidene suṭṭamayyīm̐ gāga

(||||)
yemi sesinām̐ dana kĕdurāḍedānanā
momu sūsi sedu lĕtti mŏkkīm̐gāga
vāmulaina valabulu vaḍivĕṭṭa vachchunā
premamudo tāne vachchi pĕṁḍlāḍīm̐ gāga

(||||)
yĕvvadĕm̐ dĕchchugŏninā yĕggubaṭṭe dānanā
navvudā nĕḍa māḍalu naḍabīm̐gāga
javvanamu tana sŏmmu jallim̐ baṭṭa vachchunā
sivvanam̐ dāne nābai sesavĕṭṭīm̐ gāga

(||||)
yĕppuḍu dā vichchesinā yĕḍanuṁṭi vanenā
vŏppi kaum̐giliṁchi yiṭṭe vŏnarem̐gāga
nĕppuna śhrī veṁkaḍanilayum̐ḍu nannum̐gūḍĕ
kappi tāne kaṁkaṇamu gaṭṭīm̐ gāgā