పొందుసేసి రతులను భోగించుటే మేలు
(॥పల్లవి॥)
పొందుసేసి రతులను భోగించుటే మేలు
సందడెంటా బొమ్మలను జంకించనేఁటికి
(॥పొందు॥)
నాము లెక్కి నీ సిగ్గు నవ్వులై వెడలఁజొచ్చె
మోమునఁ గళలై మించె మోహమెల్లాను
గోమునఁ బులకలై కోరికె లీరికెలెత్తె
కోమలి నీపతితోడ గుట్టు చూపనేఁటికే
(॥పొందు॥)
చిత్తము నీరై కరఁగి చెమటలై వెళఁ(ళ్లఁ?) జొచ్చె
గుత్తపు వయసు చనుగుబ్బలాయను
మొత్తపుఁ దమకములు ముంగురులై పెనగొనె
హత్తిన అడియాసలు అడఁచుకోనేఁటికే
(॥పొందు॥)
నెలకొన్న నీ వలపు నివ్వెరగులు గాఁజొచ్చె
లలి నీమదము కన్నులకుఁ గెంపాయ
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నినుఁగూడె
పలుకుఁ బంతము చెల్లె పరాకు లిఁకేఁటికే
(||pallavi||)
pŏṁdusesi radulanu bhogiṁchuḍe melu
saṁdaḍĕṁṭā bŏmmalanu jaṁkiṁchanem̐ṭigi
(||pŏṁdu||)
nāmu lĕkki nī siggu navvulai vĕḍalam̐jŏchchĕ
momunam̐ gaḽalai miṁchĕ mohamĕllānu
gomunam̐ bulagalai korigĕ līrigĕlĕttĕ
komali nībadidoḍa guṭṭu sūbanem̐ṭige
(||pŏṁdu||)
sittamu nīrai karam̐gi sĕmaḍalai vĕḽam̐(ḽlam̐?) jŏchchĕ
guttabu vayasu sanugubbalāyanu
mŏttabum̐ damagamulu muṁgurulai pĕnagŏnĕ
hattina aḍiyāsalu aḍam̐sugonem̐ṭige
(||pŏṁdu||)
nĕlagŏnna nī valabu nivvĕragulu gām̐jŏchchĕ
lali nīmadamu kannulagum̐ gĕṁpāya
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninum̐gūḍĕ
palugum̐ baṁtamu sĕllĕ parāgu lim̐kem̐ṭige