Pomdu seya nerusunu poomsi mellamellane

పొందు సేయ నేరుచును పూఁచి మెల్లమెల్లనే
Language

(॥పల్లవి॥)
పొందు సేయ నేరుచును పూఁచి మెల్లమెల్లనే
యెందరిని మరిగించెనో యిట్లానే యీతఁడు

(॥పొందు॥)
వూరకున్న నాకుఁ దెచ్చి వుంగరము చేతికిచ్చి
మేరమీరి చెనకినీ మెల్ల మెల్లనే
వోరుచుకున్నా మానఁడు వొంటినుండఁగా నాతో
తేరకొన నవ్వు నవ్వి దిమ్మురేఁచీ నీతఁడు

(॥పొందు॥)
గుట్టుతోడిదాన నాపె గురిగింజబంతి వేసి
మెట్టీ నాపాదాలు మెల్లమెల్లనే
వొట్టు వెట్టినా విడువఁ డొద్ద నిట్టె కూచుండి
వట్టి జాణతనా లాడి వావి చెప్పి నీతఁడు

(॥పొందు॥)
అక్కున నలమేల్మంగనైన నన్ను గారవించి
మిక్కుటమై కాఁగిలించీ మెల్లమెల్లనే
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డిదివో నేఁ బీన్నదాన
అక్కజపు రుతులను నాదరించీ నీతఁడు

(||pallavi||)
pŏṁdu seya nerusunu pūm̐si mĕllamĕllane
yĕṁdarini marigiṁchĕno yiṭlāne yīdam̐ḍu

(||pŏṁdu||)
vūragunna nāgum̐ dĕchchi vuṁgaramu sedigichchi
meramīri sĕnaginī mĕlla mĕllane
vorusugunnā mānam̐ḍu vŏṁṭinuṁḍam̐gā nādo
teragŏna navvu navvi dimmurem̐sī nīdam̐ḍu

(||pŏṁdu||)
guṭṭudoḍidāna nābĕ gurigiṁjabaṁti vesi
mĕṭṭī nābādālu mĕllamĕllane
vŏṭṭu vĕṭṭinā viḍuvam̐ ḍŏdda niṭṭĕ kūsuṁḍi
vaṭṭi jāṇadanā lāḍi vāvi sĕppi nīdam̐ḍu

(||pŏṁdu||)
akkuna nalamelmaṁganaina nannu gāraviṁchi
mikkuḍamai kām̐giliṁchī mĕllamĕllane
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍidivo nem̐ bīnnadāna
akkajabu rudulanu nādariṁchī nīdam̐ḍu