పొందు లిద్దరివి పొత్తున నున్నవి
(॥పల్లవి॥)
పొందు లిద్దరివి పొత్తున నున్నవి
కందువ లడుగరే కాంతలిటు
(॥॥)
తలఁపులెనసితే తగులమి గలుగును
పలుకులొనరితేఁ బనులౌను
చెలిమి గలిగితే చెనకులు ననుచును
తెలియరె వలపుల తేటలివి
(॥॥)
నయములుండితే నగవులు గలుగును
ప్రియముల జనువులు పెనఁగొనును
క్రియలు దెలిసితే కెరలుఁ దమకములు
నియతిఁ జూడరే నేర్పులివి
(॥॥)
కూడినయపుడే గురుతులు నిలుచును
యీడుగఁ బెనగిన నింపౌను
యీడనే శ్రీవేంకటేశుఁడు గలసెను
వేడుక సేయరె వెలసె నివి
(||pallavi||)
pŏṁdu liddarivi pŏttuna nunnavi
kaṁduva laḍugare kāṁtaliḍu
(||||)
talam̐pulĕnaside tagulami galugunu
palugulŏnaridem̐ banulaunu
sĕlimi galigide sĕnagulu nanusunu
tĕliyarĕ valabula teḍalivi
(||||)
nayamuluṁḍide nagavulu galugunu
priyamula januvulu pĕnam̐gŏnunu
kriyalu dĕliside kĕralum̐ damagamulu
niyadim̐ jūḍare nerbulivi
(||||)
kūḍinayabuḍe gurudulu nilusunu
yīḍugam̐ bĕnagina niṁpaunu
yīḍane śhrīveṁkaḍeśhum̐ḍu galasĕnu
veḍuga seyarĕ vĕlasĕ nivi