పొందినట్టి తన మేలు పొగడే నేను
(॥పల్లవి॥)
పొందినట్టి తన మేలు పొగడే నేను
యిందరిలో యీ సలిగె యెవ్వరికిఁ గలదే
(॥పొంది॥)
కైవశమై నాకుఁ దాను గలుగు టెఱుఁగుదును
సోవల నూరకే నేనూ సొలతుఁగాని
నావల్లఁ గొర తెంచఁడు నవ్వుతానే వుండు తాను
యీవలపు లీచనవు లెవ్వరికిఁ గలవే
(॥పొంది॥)
వేడుకతో నామాఁట వినే దెఱుఁగుదును
జాడగా బొమ్మలనే పై జంకింతుఁగాని
యేడ నాతోఁ గలఁగఁడు ఇచ్చకములే సేఁసుగాని
యీడుజోడై యీననుపు లెవ్వరికిఁ గలవే
(॥పొంది॥)
గక్కన నన్నిట్లాను కలసే దెఱుఁగుదును
పక్కనఁ బదరి నేను పై కొందుఁగాని
వొక్కటై శ్రీ వేంకటేశుఁ డొద్దనఁడు మెచ్చుఁగాని
యిక్కువలై యీభాగ్యా లెవ్వరికిఁ గలవే
(||pallavi||)
pŏṁdinaṭṭi tana melu pŏgaḍe nenu
yiṁdarilo yī saligĕ yĕvvarigim̐ galade
(||pŏṁdi||)
kaivaśhamai nāgum̐ dānu galugu ṭĕṟum̐gudunu
sovala nūrage nenū sŏladum̐gāni
nāvallam̐ gŏra tĕṁcham̐ḍu navvudāne vuṁḍu tānu
yīvalabu līsanavu lĕvvarigim̐ galave
(||pŏṁdi||)
veḍugado nāmām̐ṭa vine dĕṟum̐gudunu
jāḍagā bŏmmalane pai jaṁkiṁtum̐gāni
yeḍa nādom̐ galam̐gam̐ḍu ichchagamule sem̐sugāni
yīḍujoḍai yīnanubu lĕvvarigim̐ galave
(||pŏṁdi||)
gakkana nanniṭlānu kalase dĕṟum̐gudunu
pakkanam̐ badari nenu pai kŏṁdum̐gāni
vŏkkaḍai śhrī veṁkaḍeśhum̐ ḍŏddanam̐ḍu mĕchchum̐gāni
yikkuvalai yībhāgyā lĕvvarigim̐ galave