Pomdaina yimtulu lero purushulu lero bhoomi

పొందైన యింతులు లేరో పురుషులు లేరో భూమి
Language

(॥పల్లవి॥)
పొందైన యింతులు లేరో పురుషులు లేరో భూమి
ఇందే కంటిమి వింత లివి గొన్ని వలెనా

(॥పొందై॥)
వేడుకా నొకకొంత విసువూ నొకకొంత
ఆడనుండే పతి మాటలాడించఁగా
తోడ నలయించుకంటె తొల్లిటి అలుకే మేలు
వాడికె నీసతి కింతవలెనా అగడు

(॥పొందై॥)
సెలవిన వ్వొకకొంత చిక్కుచేయీ నొకకొంత
సొలసి ముందర నిల్చి జోలిదవ్వఁగా
నిలుచుండి యేఁచుకంటె నీవు రానన్నా మేలు
వలచినచెలి కింతవలెనా తగవు

(॥పొందై॥)
నిండుఁగల లొకకొంత నిట్టూర్పు నొకకొంత
అండ నీవు కాఁగిలించి అటు గూడఁగా
కొండల శ్రీవేంకటేశ కోమలిపై నీమేలు
వండు గేరెఁ జెలి కింకవలెనా వెరగు

(||pallavi||)
pŏṁdaina yiṁtulu lero puruṣhulu lero bhūmi
iṁde kaṁṭimi viṁta livi gŏnni valĕnā

(||pŏṁdai||)
veḍugā nŏgagŏṁta visuvū nŏgagŏṁta
āḍanuṁḍe padi māḍalāḍiṁcham̐gā
toḍa nalayiṁchugaṁṭĕ tŏlliḍi aluge melu
vāḍigĕ nīsadi kiṁtavalĕnā agaḍu

(||pŏṁdai||)
sĕlavina vvŏgagŏṁta sikkuseyī nŏgagŏṁta
sŏlasi muṁdara nilsi jolidavvam̐gā
nilusuṁḍi yem̐sugaṁṭĕ nīvu rānannā melu
valasinasĕli kiṁtavalĕnā tagavu

(||pŏṁdai||)
niṁḍum̐gala lŏgagŏṁta niṭṭūrbu nŏgagŏṁta
aṁḍa nīvu kām̐giliṁchi aḍu gūḍam̐gā
kŏṁḍala śhrīveṁkaḍeśha komalibai nīmelu
vaṁḍu gerĕm̐ jĕli kiṁkavalĕnā vĕragu