పొందైన నీ వలపులు పులిసీ నటే
(॥పల్లవి॥)
పొందైన నీ వలపులు పులిసీ నటే
యిందరిలో నిన్ను నేలీ యేల వేగిరించేవే
(॥॥)
చెక్కులిట్టే నొక్కినాఁడు సెలవుల నవ్వినాఁడు
మొక్కు లియ్యకొనెఁ గదే మొగఁడు
కక్కసించ నేమిటికే కౌఁగిలించుకొనీఁ గాక
యెక్కువ తక్కువలకు నేల వేగిరించేవే
(॥॥)
నీ దిక్కే చూచినాఁడు నీతో మాటలాడినాఁడు
పొదుకొని నిమ్మపండు పై వేసినాఁడు
గోదిల నీ కిపు డేలే కొరిక చెల్లించీఁ గాక
యీదెస నింతటిలోన నేల వేగిరించేవే
(॥॥)
పాను పెక్కించు కొన్నాఁడు పాదాలు పైఁ జాఁచినాఁడు
చే నంటి నీ కుచములు చెనకెఁ గదే
పూని శ్రీ వేంకటేశుఁడు పొంచి యింకాఁ గూడీఁ గాక
యీ నెలవుననే వుండి యేల వేగిరంచేవే
(||pallavi||)
pŏṁdaina nī valabulu pulisī naḍe
yiṁdarilo ninnu nelī yela vegiriṁcheve
(||||)
sĕkkuliṭṭe nŏkkinām̐ḍu sĕlavula navvinām̐ḍu
mŏkku liyyagŏnĕm̐ gade mŏgam̐ḍu
kakkasiṁcha nemiḍige kaum̐giliṁchugŏnīm̐ gāga
yĕkkuva takkuvalagu nela vegiriṁcheve
(||||)
nī dikke sūsinām̐ḍu nīdo māḍalāḍinām̐ḍu
pŏdugŏni nimmabaṁḍu pai vesinām̐ḍu
godila nī kibu ḍele kŏriga sĕlliṁchīm̐ gāga
yīdĕsa niṁtaḍilona nela vegiriṁcheve
(||||)
pānu pĕkkiṁchu kŏnnām̐ḍu pādālu paim̐ jām̐sinām̐ḍu
se naṁṭi nī kusamulu sĕnagĕm̐ gade
pūni śhrī veṁkaḍeśhum̐ḍu pŏṁchi yiṁkām̐ gūḍīm̐ gāga
yī nĕlavunane vuṁḍi yela vegiraṁcheve