Pomchina neemannanagu pogadusumdudum gaaga

పొంచిన నీమన్ననకు పొగడుచుండుదుఁ గాక
Language

(॥పల్లవి॥)
పొంచిన నీమన్ననకు పొగడుచుండుదుఁ గాక
కంచములో నమృతము కడకుఁ బోఁదోతునా

(॥పొంచి॥)
నీవుసేసేచేఁతలలో నే నేరము లెంచేనా
కైవసమై అన్ని యునుఁ గైకొందుఁగాక
పూవులపుప్పొడిలోన పూఁదేనె చిందితేను
వేవేలైనా నందుకు వింతలుగాఁ జూతురా

(॥పొంచి॥)
ఆడిననీమాటలలో అందములు వెదకేనా
వేడుకతో మంచివేకా విందుఁగాక
వీడెములోఁ గప్పురము వింతలుగాఁ గలసితే
వీడుపడీనా యందుకు వేరులుగాఁ జూతురా

(॥పొంచి॥)
పొందిననీరతులలో పొరపొచ్చా లరసేనా
కందువలు మొరయఁ బొగడుదుఁ గాక
గందములోపల మంచికస్తూరి గలసితే
విందులశ్రీవేంకటేశ వెగటుగాఁ జూతురా

(||pallavi||)
pŏṁchina nīmannanagu pŏgaḍusuṁḍudum̐ gāga
kaṁchamulo namṛtamu kaḍagum̐ bom̐dodunā

(||pŏṁchi||)
nīvusesesem̐talalo ne neramu lĕṁchenā
kaivasamai anni yunum̐ gaigŏṁdum̐gāga
pūvulabuppŏḍilona pūm̐denĕ siṁdidenu
vevelainā naṁdugu viṁtalugām̐ jūdurā

(||pŏṁchi||)
āḍinanīmāḍalalo aṁdamulu vĕdagenā
veḍugado maṁchivegā viṁdum̐gāga
vīḍĕmulom̐ gappuramu viṁtalugām̐ galaside
vīḍubaḍīnā yaṁdugu verulugām̐ jūdurā

(||pŏṁchi||)
pŏṁdinanīradulalo pŏrabŏchchā larasenā
kaṁduvalu mŏrayam̐ bŏgaḍudum̐ gāga
gaṁdamulobala maṁchigastūri galaside
viṁdulaśhrīveṁkaḍeśha vĕgaḍugām̐ jūdurā