Pomchi yimka neduvale pomdu seseve

పొంచి యిఁక నెటువలె పొందు సేసేవే
Language

(॥పల్లవి॥)
పొంచి యిఁక నెటువలె పొందు సేసేవే
దించరాని పొంతనాలు దేవరే కూర్చెనే

(॥పొంచి॥)
సొలసి యాతనిదిక్కు చూడవదేమే
నలువంక నాతనిమై నాఁటీనంటానే
మలసి కొంతయినాను మాఁటలాడవే
నిలిచి యేమనినాను నిందమోచునే

(॥పొంచి॥)
ముడువనే శిరసున ముడిపువ్వులూ
కడలేని వవియెకా కంతునమ్ములూ
అడరినదప్పి దేర నధర మీవే
నడుమఁ బలుసోఁకులు నాఁటీనంటానే

(॥పొంచి॥)
శ్రీవేంకటేశ్వరునిఁ జెక్కునొక్కవే
ఆవల నొత్తినరేక లవి రాఁగీనే
కావిరి నలమేలుమంగవుగదవే
కైవశమై కూడితి వెక్కసమయ్యీఁగదవే

(||pallavi||)
pŏṁchi yim̐ka nĕḍuvalĕ pŏṁdu seseve
diṁcharāni pŏṁtanālu devare kūrsĕne

(||pŏṁchi||)
sŏlasi yādanidikku sūḍavademe
naluvaṁka nādanimai nām̐ṭīnaṁṭāne
malasi kŏṁtayinānu mām̐ṭalāḍave
nilisi yemaninānu niṁdamosune

(||pŏṁchi||)
muḍuvane śhirasuna muḍibuvvulū
kaḍaleni vaviyĕgā kaṁtunammulū
aḍarinadappi dera nadhara mīve
naḍumam̐ balusom̐kulu nām̐ṭīnaṁṭāne

(||pŏṁchi||)
śhrīveṁkaḍeśhvarunim̐ jĕkkunŏkkave
āvala nŏttinarega lavi rām̐gīne
kāviri nalamelumaṁgavugadave
kaivaśhamai kūḍidi vĕkkasamayyīm̐gadave