పొంచి పొంచి మాతో నేల పురుఁడు వెట్టుకొనేవు
(॥పల్లవి॥)
పొంచి పొంచి మాతో నేల పురుఁడు వెట్టుకొనేవు
నించి యిన్నిటా దొరవు నీకుఁ జెల్లదా
(॥పొంచి॥)
చలపట్టి మాకే నీతో జవదాఁట రాదు గాక
నెల వై పెచ్చు వెరుగ నీకుఁ జెల్లదా
కలది గ లట్టే మాకు కల్ల లాడ రాదు గాక
నిలువున బొంకు బొంక నీకుఁ జెల్లదా
(॥పొంచి॥)
మఱఁగు లెల్లా విరులు మాకుఁ జెల్ల దింతే గాక
నెఱి దాఁగి పొడచూప నీకుఁ జెల్లదా
తఱిఁ గపటము మాకుఁ దగవు గా దింతే గాక
నెఱవుదొంతగనాలు నీకుఁ జెల్లదా
(॥పొంచి॥)
చిమ్ముచు మాకే నీతో చేరి నవ్వ రాదు గాక
నెమ్మది సిగ్గు విడువ నీకుఁ జెల్లదా
నమ్మించి శ్రీవెంకటేశ నన్ను నిట్టె కూడితివి
నెమ్మి నన్ను మన్నించ నీకుఁ జెల్లదా
(||pallavi||)
pŏṁchi pŏṁchi mādo nela purum̐ḍu vĕṭṭugŏnevu
niṁchi yinniḍā dŏravu nīgum̐ jĕlladā
(||pŏṁchi||)
salabaṭṭi māge nīdo javadām̐ṭa rādu gāga
nĕla vai pĕchchu vĕruga nīgum̐ jĕlladā
kaladi ga laṭṭe māgu kalla lāḍa rādu gāga
niluvuna bŏṁku bŏṁka nīgum̐ jĕlladā
(||pŏṁchi||)
maṟam̐gu lĕllā virulu māgum̐ jĕlla diṁte gāga
nĕṟi dām̐gi pŏḍasūba nīgum̐ jĕlladā
taṟim̐ gabaḍamu māgum̐ dagavu gā diṁte gāga
nĕṟavudŏṁtaganālu nīgum̐ jĕlladā
(||pŏṁchi||)
simmusu māge nīdo seri navva rādu gāga
nĕmmadi siggu viḍuva nīgum̐ jĕlladā
nammiṁchi śhrīvĕṁkaḍeśha nannu niṭṭĕ kūḍidivi
nĕmmi nannu manniṁcha nīgum̐ jĕlladā