Pomchi needollidi pomdulu soodamu

పొంచి నీతొల్లిటి పొందులు చూతము
Language

(॥పల్లవి॥)
పొంచి నీతొల్లిటి పొందులు చూతము
మించి నిజమైతే మెచ్చేనయ్యా

(॥పొంచి॥)
తెరమఱుఁగున తెఱన మాఁటాడె
అరుదంది నీవు ఆలించేవు
తాతెయౌఅరవసి యెఱుఁగుదునా ఆపె యెవ్వతెయౌతా
శిరసెత్తి నాతోఁ జెప్పవయ్యా

(॥పొంచి॥)
చేయించాఁచి నిన్ను చెండున వేసెను
సోయగాన నట్టె చూచేవు
దాయకపాయక తలఁచుకొంటివా
యీయెడ నా కానతియ్యవయ్యా

(॥పొంచి॥)
గక్కనఁ బైకొని కాఁగిలించుకొనె
చిక్కి ధ్యానములు సేసేవు
యిక్కువ శ్రీవేంకటేశ నన్నేలిటు
చొక్కి నవ్వేవు నాసుద్దు లివయ(యా?)

(||pallavi||)
pŏṁchi nīdŏlliḍi pŏṁdulu sūdamu
miṁchi nijamaide mĕchchenayyā

(||pŏṁchi||)
tĕramaṟum̐guna tĕṟana mām̐ṭāḍĕ
arudaṁdi nīvu āliṁchevu
tādĕyauaravasi yĕṟum̐gudunā ābĕ yĕvvadĕyaudā
śhirasĕtti nādom̐ jĕppavayyā

(||pŏṁchi||)
seyiṁchām̐si ninnu sĕṁḍuna vesĕnu
soyagāna naṭṭĕ sūsevu
dāyagabāyaga talam̐sugŏṁṭivā
yīyĕḍa nā kānadiyyavayyā

(||pŏṁchi||)
gakkanam̐ baigŏni kām̐giliṁchugŏnĕ
sikki dhyānamulu sesevu
yikkuva śhrīveṁkaḍeśha nanneliḍu
sŏkki navvevu nāsuddu livaya(yā?)