పొంచి నీ వేలాతనికి పూనుక మాటలాడేవే
(॥పల్లవి॥)
పొంచి నీ వేలాతనికి పూనుక మాటలాడేవే
యెంచి చూడ రమణుని కిన్నియు నితవులే
(॥॥)
పంతము లాడుకొందురు పడఁతులు సారె సారె
చింతలఁ జన విచ్చిన చెలువునితో
వంతులును మీఱుదురు వాసితో నొక్కొకవేళ
వింతలైన మన్ననలు వెసఁ జల్లేచోటను
(॥॥)
వొడివట్టి తీతురు వుదుటున నవ్వుదురు
వొడబాటులు గలిగివుండే కాంతలు
చిడిముడి జంకింతురు చేతికి లోనైనప్పుడు
బడివాయక పొందులు పరగేటి చోటను
(॥॥)
చేముంచి పెనఁగుదురు చెక్కు నొక్కి కూడుదురు
ప్రేమతో సేసవెట్టిన పెండ్లికూఁతులు
ఆముక శ్రీ వేంకటేశుఁ డాతఁ డిట్టే యీకెఁ గూడె
నేమము లెల్లా నీడేరు నిండుకొన్నచోటను
(||pallavi||)
pŏṁchi nī velādanigi pūnuga māḍalāḍeve
yĕṁchi sūḍa ramaṇuni kinniyu nidavule
(||||)
paṁtamu lāḍugŏṁduru paḍam̐tulu sārĕ sārĕ
siṁtalam̐ jana vichchina sĕluvunido
vaṁtulunu mīṟuduru vāsido nŏkkŏgaveḽa
viṁtalaina mannanalu vĕsam̐ jallesoḍanu
(||||)
vŏḍivaṭṭi tīduru vuduḍuna navvuduru
vŏḍabāḍulu galigivuṁḍe kāṁtalu
siḍimuḍi jaṁkiṁturu sedigi lonainappuḍu
baḍivāyaga pŏṁdulu parageḍi soḍanu
(||||)
semuṁchi pĕnam̐guduru sĕkku nŏkki kūḍuduru
premado sesavĕṭṭina pĕṁḍligūm̐tulu
āmuga śhrī veṁkaḍeśhum̐ ḍādam̐ ḍiṭṭe yīgĕm̐ gūḍĕ
nemamu lĕllā nīḍeru niṁḍugŏnnasoḍanu