Pomchi nee sakkamdanamu pogadide nemaayene

పొంచి నీ చక్కఁదనము పొగడితే నేమాయెనే
Language

(॥పల్లవి॥)
పొంచి నీ చక్కఁదనము పొగడితే నేమాయెనే
కొంచి కొంచి వలపేల గుట్టున దాఁచేవే

(॥పొంచి॥)
మొగమెత్తి నన్నుఁ జూచి మోవి గొంత గదలించి
పగటున నిదియేల పంతాలాడేవే
చిగురునీచేతులు చెక్కిటఁ జేర్చుకొని
సగము గొరి యంత జంకిఁచేవే

(॥పొంచి॥)
బలిమిఁ జన్నుమీఁదిపయ్యద బిగించుకొంటా
చలముల సణఁ గెంత చల్లవచ్చేవే
చెలపలచెమటలు చెరఁగున నద్దుకొని
యెలమి నవ్వుతాఁ బాద మేమిదొక్కేవే

(॥పొంచి॥)
తీపులై నవలపులతేనెలు పూసి పూసి
పైపైనే సిగ్గులెట్టు పచారించేవే
యేవున నలమేల్మంగ నేను శ్రీవేంకటేశుఁడ
రాపగుకూటము లెందు రచ్చవేసేవే

(||pallavi||)
pŏṁchi nī sakkam̐danamu pŏgaḍide nemāyĕne
kŏṁchi kŏṁchi valabela guṭṭuna dām̐seve

(||pŏṁchi||)
mŏgamĕtti nannum̐ jūsi movi gŏṁta gadaliṁchi
pagaḍuna nidiyela paṁtālāḍeve
sigurunīsedulu sĕkkiḍam̐ jersugŏni
sagamu gŏri yaṁta jaṁkim̐seve

(||pŏṁchi||)
balimim̐ jannumīm̐dibayyada bigiṁchugŏṁṭā
salamula saṇam̐ gĕṁta sallavachcheve
sĕlabalasĕmaḍalu sĕram̐guna naddugŏni
yĕlami navvudām̐ bāda memidŏkkeve

(||pŏṁchi||)
tībulai navalabuladenĕlu pūsi pūsi
paibaine siggulĕṭṭu pasāriṁcheve
yevuna nalamelmaṁga nenu śhrīveṁkaḍeśhum̐ḍa
rābagugūḍamu lĕṁdu rachchaveseve