Pomchi naagu naage pogadugom jaalam gaaga

పొంచి నాకు నాకే పొగడుకోఁ జాలఁ గాక
Language

(॥పల్లవి॥)
పొంచి నాకు నాకే పొగడుకోఁ జాలఁ గాక
యెంచఁబోతే నీ గుణాలు యెవ్వరైనా మెత్తురా

(॥పొంచి॥)
వోసరించకాపెయింట నుండఁగాఁ జూచి నిన్ను
సేసినట్టల్లాఁ జేయఁ జెల్లదా నాకు
బాసదప్పి నీవలె పదర నే నోపఁ గాక
వీసమంత పొల్లగల్లా విడుతువా నీవు

(॥పొంచి॥)
తగ నేఁ జూడఁగానాకె తమ్ముల మందుకొంటివి
తగవులఁ బెట్టనింకఁ దగదా నాకు
తెగువ నీవలె నాకు దేవరియ్యఁడాయఁ గాక
పగిడి వెట్టి నవ్వితేఁ బదరవా నీవు

(॥పొంచి॥)
వొద్దనుండి యాకెమీఁదనొరఁగఁగాఁ జూచి నిన్ను
వుద్దండపు మచ్చరములుండవా నాకు
గద్దరి శ్రీవేంకటేశ గక్కనఁ గూడితి నన్ను
వద్దన్నా మానక యింత వలతువా నీవు

(||pallavi||)
pŏṁchi nāgu nāge pŏgaḍugom̐ jālam̐ gāga
yĕṁcham̐bode nī guṇālu yĕvvarainā mĕtturā

(||pŏṁchi||)
vosariṁchagābĕyiṁṭa nuṁḍam̐gām̐ jūsi ninnu
sesinaṭṭallām̐ jeyam̐ jĕlladā nāgu
bāsadappi nīvalĕ padara ne nobam̐ gāga
vīsamaṁta pŏllagallā viḍuduvā nīvu

(||pŏṁchi||)
taga nem̐ jūḍam̐gānāgĕ tammula maṁdugŏṁṭivi
tagavulam̐ bĕṭṭaniṁkam̐ dagadā nāgu
tĕguva nīvalĕ nāgu devariyyam̐ḍāyam̐ gāga
pagiḍi vĕṭṭi navvidem̐ badaravā nīvu

(||pŏṁchi||)
vŏddanuṁḍi yāgĕmīm̐danŏram̐gam̐gām̐ jūsi ninnu
vuddaṁḍabu machcharamuluṁḍavā nāgu
gaddari śhrīveṁkaḍeśha gakkanam̐ gūḍidi nannu
vaddannā mānaga yiṁta valaduvā nīvu