Pomchi mogamichchalagu poddu gadabevu gaaga

పొంచి మొకమిచ్చలకు పొద్దు గడపేవు గాక
Language

(॥పల్లవి॥)
పొంచి మొకమిచ్చలకు పొద్దు గడపేవు గాక
పంచల చిత్తాన నీకుఁ బట్టఁబోయీనా

(॥పొంచి॥)
కూరిమొకచో నుండఁగ కొచ్చి యెంత మాటాడిన
సారెకుఁ బరాకే కాక చవి వుట్టీనా
గారవించెప్పటనుండి కతలెల్లాఁ జెప్పె నీకు
పేరి కుచ్చందొకటైనా బెరయఁ జెప్పేవా

(॥పొంచి॥)
చూపులొకచో నుండఁగ సొలసెంత పెనఁగిన
దాపులఁ బోరచే కాక తమి వుట్టీనా
యేపున నింతవడాకె యెదుటనే వుండె నీకు
రూపించి యా సింగారమేరుపఱచి చెప్పేవా

(॥పొంచి॥)
మాటలొకచో నుండఁగా మర్మములెంత యంటిన
పాటపాటే కాక బత్తి పాదుకొనీనా
యీటున శ్రీవేంకటేశ యేలితి వాకెను నన్ను
కూటములు తడఁబడకుండాఁ జెప్పేవా

(||pallavi||)
pŏṁchi mŏgamichchalagu pŏddu gaḍabevu gāga
paṁchala sittāna nīgum̐ baṭṭam̐boyīnā

(||pŏṁchi||)
kūrimŏgaso nuṁḍam̐ga kŏchchi yĕṁta māḍāḍina
sārĕgum̐ barāge kāga savi vuṭṭīnā
gāraviṁchĕppaḍanuṁḍi kadalĕllām̐ jĕppĕ nīgu
peri kuchchaṁdŏgaḍainā bĕrayam̐ jĕppevā

(||pŏṁchi||)
sūbulŏgaso nuṁḍam̐ga sŏlasĕṁta pĕnam̐gina
dābulam̐ borase kāga tami vuṭṭīnā
yebuna niṁtavaḍāgĕ yĕduḍane vuṁḍĕ nīgu
rūbiṁchi yā siṁgāramerubaṟasi sĕppevā

(||pŏṁchi||)
māḍalŏgaso nuṁḍam̐gā marmamulĕṁta yaṁṭina
pāḍabāḍe kāga batti pādugŏnīnā
yīḍuna śhrīveṁkaḍeśha yelidi vāgĕnu nannu
kūḍamulu taḍam̐baḍaguṁḍām̐ jĕppevā