పోలించి చూచితేను పొఁసగు నిద్దరికిని
(॥పల్లవి॥)
పోలించి చూచితేను పొఁసగు నిద్దరికిని
మేలువారు తొల్లె మీరు వోలలాడరయ్య
(॥॥)
కదిసి యింతి నీతో కడు మాఁటలాడఁ గాను
అదె మోవిచిగురులు యల్లాడఁ జొచ్చె
యిదె వసంతకాలము యెదిరించె నీకు నేఁడు
సదరాన వలపులు చల్లులాడరయ్యా
(॥॥)
కందువఁ గాంత నిన్నుఁ గాఁగిలినిచుకొనఁగాను
అందమై బాహులతలు అల్లుకోఁ జొచ్చె
వింతజాజరకాలము వేడుకతోఁ దలఁపించె
సంతోసపుచిరునవ్వు చల్లులాడరయ్యా
(॥॥)
ఆంచెల రతివేళల నంగన నిన్నుఁ గూడఁ గా
మించి గుబ్బలపూగుత్తులు మెరయఁ జొచ్చె
కొంచక శ్రీవేంకటేశ కూడె నామనికాలము
చంచలించక యింపులు చల్లులాడరయ్య
(||pallavi||)
poliṁchi sūsidenu pŏm̐sagu niddarigini
meluvāru tŏllĕ mīru volalāḍarayya
(||||)
kadisi yiṁti nīdo kaḍu mām̐ṭalāḍam̐ gānu
adĕ movisigurulu yallāḍam̐ jŏchchĕ
yidĕ vasaṁtagālamu yĕdiriṁchĕ nīgu nem̐ḍu
sadarāna valabulu sallulāḍarayyā
(||||)
kaṁduvam̐ gāṁta ninnum̐ gām̐gilinisugŏnam̐gānu
aṁdamai bāhuladalu allugom̐ jŏchchĕ
viṁtajājaragālamu veḍugadom̐ dalam̐piṁchĕ
saṁtosabusirunavvu sallulāḍarayyā
(||||)
āṁchĕla radiveḽala naṁgana ninnum̐ gūḍam̐ gā
miṁchi gubbalabūguttulu mĕrayam̐ jŏchchĕ
kŏṁchaga śhrīveṁkaḍeśha kūḍĕ nāmanigālamu
saṁchaliṁchaga yiṁpulu sallulāḍarayya