Polamtulu puttamgaane vuttinavaadu livi

పొలఁతులు పుట్టఁగానే వుట్టినవాదు లివి
Language

(॥పల్లవి॥)
పొలఁతులు పుట్టఁగానే వుట్టినవాదు లివి
నెలకొని కలఁగదు నేరుపరి యైనది

(॥పొల॥)
మగవాఁ డొకతిని మన్నించితే సవతులు
యెగసక్కే లాడుదురు యీసడింతురు
మొగమొగాలు చూతురు ముసగసలాడుదురు
పగటున నవ్వుదురు పంతము లాడుదురు

(॥పొల॥)
వలచినాతఁ డొక తెవద్దనుంటేఁ దోడివారు
కెలతురు వెంగేలకుఁ గేఁకరింతురు
చెలఁగి వుప్పతింతురు చేతులు పైఁజాఁతురు
తలకొని దూరుదురు తప్పక చూతురు

(॥పొల॥)
యేలిన వాఁడొకతెపాలిండ్లు ముట్టితే నందరు
తాలిమితోఁ బొందఁగ తమకింతురు
ఆ లీల శ్రీ వేంకటేశుఁ డలమేల్‌మంగ నీవు
వాలాయించి కూడితిరి వద్దివారు మెత్తురు

(||pallavi||)
pŏlam̐tulu puṭṭam̐gāne vuṭṭinavādu livi
nĕlagŏni kalam̐gadu nerubari yainadi

(||pŏla||)
magavām̐ ḍŏgadini manniṁchide savadulu
yĕgasakke lāḍuduru yīsaḍiṁturu
mŏgamŏgālu sūduru musagasalāḍuduru
pagaḍuna navvuduru paṁtamu lāḍuduru

(||pŏla||)
valasinādam̐ ḍŏga tĕvaddanuṁṭem̐ doḍivāru
kĕladuru vĕṁgelagum̐ gem̐kariṁturu
sĕlam̐gi vuppadiṁturu sedulu paim̐jām̐turu
talagŏni dūruduru tappaga sūduru

(||pŏla||)
yelina vām̐ḍŏgadĕbāliṁḍlu muṭṭide naṁdaru
tālimidom̐ bŏṁdam̐ga tamagiṁturu
ā līla śhrī veṁkaḍeśhum̐ ḍalamel‌maṁga nīvu
vālāyiṁchi kūḍidiri vaddivāru mĕtturu