Polamtigi needobomdu pomkagum buttemdaaya

పొలఁతికి నీతోపొందు పోఁకకుఁ బుట్టెఁడాయ
Language

(॥పల్లవి॥)
పొలఁతికి నీతోపొందు పోఁకకుఁ బుట్టెఁడాయ
యెలమి నీభాగ్య మిఁక నెఁ(నెం?)తైనాఁ గద్దయ్యా

(॥పొలఁ॥)
పడఁతిచెక్కులవెంటఁ బన్నీటివాన గురిసె
వడి నందె మెఱుఁగులవాన గురిసె
విడివడి తురుమున విరులవాన గురిసె
చిడుముడి జవ్వనము చిగిరించెనయ్యా

(॥పొలఁ॥)
మొలకనవ్వులనె ముత్యాలవాన గురిసె
విలపులఁ చెనుజడివాన గురిసె
కలికిసిగ్గులఁ దొలుకరివానలు గురిసె
పలుమారు జవ్వనము పదనెక్కీనయ్యా

(॥పొలఁ॥)
సొరిది మోవితేనల సోనలవాన గురిసె
వరుస రతులఁ దతివాన గురిసె
యిరవై శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
పరగినజవ్వనము పచ్చిదేరెనయ్యా

(||pallavi||)
pŏlam̐tigi nīdobŏṁdu pom̐kagum̐ buṭṭĕm̐ḍāya
yĕlami nībhāgya mim̐ka nĕm̐(nĕṁ?)tainām̐ gaddayyā

(||pŏlam̐||)
paḍam̐tisĕkkulavĕṁṭam̐ bannīḍivāna gurisĕ
vaḍi naṁdĕ mĕṟum̐gulavāna gurisĕ
viḍivaḍi turumuna virulavāna gurisĕ
siḍumuḍi javvanamu sigiriṁchĕnayyā

(||pŏlam̐||)
mŏlaganavvulanĕ mutyālavāna gurisĕ
vilabulam̐ sĕnujaḍivāna gurisĕ
kaligisiggulam̐ dŏlugarivānalu gurisĕ
palumāru javvanamu padanĕkkīnayyā

(||pŏlam̐||)
sŏridi movidenala sonalavāna gurisĕ
varusa radulam̐ dadivāna gurisĕ
yiravai śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi
paraginajavvanamu pachchiderĕnayyā