Polamti dehame bhoomamdalamai

పొలఁతి దేహమే భూమండలమై
Language

(॥పల్లవి॥)
పొలఁతి దేహమే భూమండలమై
కలకాలంబునుఁ గాణాచాయ

(॥పొల॥)
కొమ్మకుచంబులకులపర్వతములు
నెమ్మదిఁ గలుగఁగ నేఁ డిదివో
పమ్మిన జవ్వనభారము మోవఁగ
తమ్మినదన కాధారంబాయ

(॥పొల॥)
కాంతగమనముల ఘనదిగ్గజములు
కంతునిబలమై కలుగఁగను
పంతమున పిఱుఁదుభారము మోవఁగ
యింతినటనలకు నిది గతియాయ

(॥పొల॥)
చెలియారనియెడి శేషుడు గలుగఁగ
అలతురుము భార మానె నిదె
వెలయఁ గూడె శ్రీవేంకటపతి యీ -
కలికిని యిదియే కడుఁగతలాయ

(||pallavi||)
pŏlam̐ti dehame bhūmaṁḍalamai
kalagālaṁbunum̐ gāṇāsāya

(||pŏla||)
kŏmmagusaṁbulagulabarvadamulu
nĕmmadim̐ galugam̐ga nem̐ ḍidivo
pammina javvanabhāramu movam̐ga
tamminadana kādhāraṁbāya

(||pŏla||)
kāṁtagamanamula ghanadiggajamulu
kaṁtunibalamai kalugam̐ganu
paṁtamuna piṟum̐dubhāramu movam̐ga
yiṁtinaḍanalagu nidi gadiyāya

(||pŏla||)
sĕliyāraniyĕḍi śheṣhuḍu galugam̐ga
aladurumu bhāra mānĕ nidĕ
vĕlayam̐ gūḍĕ śhrīveṁkaḍabadi yī -
kaligini yidiye kaḍum̐gadalāya