పొలఁతీ నీ నటనలు పొగడ నలవిగాదు
(॥పల్లవి॥)
పొలఁతీ నీ నటనలు పొగడ నలవిగాదు
నిలువున వలపులు నివ్వటిల్లఁజేయునే
(॥॥)
కందువై ననీమాటలు కప్పురపుబేంట్లు
పొందుల నీపతికి దప్పులు దీర్చునే
అందిననీసొలపు మోహములకలగలవు
సందడించీ యతనికి సంతోసము రేఁచునే
(॥॥)
సూటియైననీచూపులు సొంపగుఁదరితీపులు
గాఁటయై యీతనికి నక్కర దీర్చునే
కూటపునీనవ్వులు గుదిగుచ్చిన పువ్వులు
పాటించి యీతనిమతిఁ బరిమళించునే
(॥॥)
మతనపుఁజెనకులు మాణాకపుమినుకులు
చెంతల నీసొమ్ములై సింగారించుకునే
యింతలోనె శ్రీ వేంకటేశుఁడు నిన్నిదెకూడె
వింతలగు నీరతులు వేడుక వుట్టించునే
(||pallavi||)
pŏlam̐tī nī naḍanalu pŏgaḍa nalavigādu
niluvuna valabulu nivvaḍillam̐jeyune
(||||)
kaṁduvai nanīmāḍalu kappurabubeṁṭlu
pŏṁdula nībadigi dappulu dīrsune
aṁdinanīsŏlabu mohamulagalagalavu
saṁdaḍiṁchī yadanigi saṁtosamu rem̐sune
(||||)
sūḍiyainanīsūbulu sŏṁpagum̐daridībulu
gām̐ṭayai yīdanigi nakkara dīrsune
kūḍabunīnavvulu gudiguchchina puvvulu
pāḍiṁchi yīdanimadim̐ barimaḽiṁchune
(||||)
madanabum̐jĕnagulu māṇāgabuminugulu
sĕṁtala nīsŏmmulai siṁgāriṁchugune
yiṁtalonĕ śhrī veṁkaḍeśhum̐ḍu ninnidĕgūḍĕ
viṁtalagu nīradulu veḍuga vuṭṭiṁchune