పోలఁ జెప్ప నేమున్నది పుణ్యమువాఁడవు నీవు
(॥పల్లవి॥)
పోలఁ జెప్ప నేమున్నది పుణ్యమువాఁడవు నీవు
యేలే నంటేఁ గానిమ్మని యియ్యకొంట గాక
(॥పోల॥)
బట్టబయ లున్నాఁడ యేపని సేసి వచ్చితి
అట్టే పరమపద మడుగ నో రేది
నెట్టన నీ వొసఁగితే నీ పంగెనవాఁడనై
దిట్ట కూళతనముఁ దీసుకొంట గాక
(॥పోల॥)
వొడలు మోచు కున్నాఁడ వొక్కనాఁడుఁ దడవను
బడలి కొలువు సేయఁ బ్రాప్తి నా కేది
చిడిముడితో నీ చెరు గొందినాఁడ నై
బుడిబుడి నటు నిట్టు పొలయుట గాకా
(॥పోల॥)
యిలపైఁ బుట్టు చున్నాఁడ యెవ్వఁడను నీకు నేను
తలఁచి నిన్నుఁ గొసర తగవు నా కేది
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
చెలఁగి నీ వాఁడ నని చెప్పుకొంట గాకా
(||pallavi||)
polam̐ jĕppa nemunnadi puṇyamuvām̐ḍavu nīvu
yele naṁṭem̐ gānimmani yiyyagŏṁṭa gāga
(||pola||)
baṭṭabaya lunnām̐ḍa yebani sesi vachchidi
aṭṭe paramabada maḍuga no redi
nĕṭṭana nī vŏsam̐gide nī paṁgĕnavām̐ḍanai
diṭṭa kūḽadanamum̐ dīsugŏṁṭa gāga
(||pola||)
vŏḍalu mosu kunnām̐ḍa vŏkkanām̐ḍum̐ daḍavanu
baḍali kŏluvu seyam̐ brāpti nā kedi
siḍimuḍido nī sĕru gŏṁdinām̐ḍa nai
buḍibuḍi naḍu niṭṭu pŏlayuḍa gāgā
(||pola||)
yilabaim̐ buṭṭu sunnām̐ḍa yĕvvam̐ḍanu nīgu nenu
talam̐si ninnum̐ gŏsara tagavu nā kedi
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
sĕlam̐gi nī vām̐ḍa nani sĕppugŏṁṭa gāgā